ఇంటి నెం.13 (2024 తెలుగు సినిమా)
Jump to navigation
Jump to search
ఇంటి నెం.13 2024లో తెలుగులో విడుదలైన మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై హేసన్ పాషా నిర్మించిన ఈ సినిమాకు పన్నా రాయల్ దర్శకత్వం వహించాడు. నవీద్‌బాబు, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 01న విడుదలైంది.[2]
కథ
[మార్చు]అర్జున్, అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడు పోవడంతో ప్రచురణకర్త ఆయనకు బహుమానంగా ఇంటి నెంబర్ 13 అనే విల్లాను బహుమానంగా ఇస్తాడు. ఆ ఇంట్లో అతని అన్నయ్య సంజయ్ కుటుంబ సభ్యులతో ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో కొన్ని చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గజానంద్ (ఆనంద్‌రాజ్) సైక్రియాటిస్ట్ ఆ ఇంట్లో వచ్చి ఆ ఇంట్లో ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడనేదే మిగతా కథ.[3]
నటీనటులు
[మార్చు]- నవీద్‌బాబు
- ఇర్ఫాన్
- నికీషా
- ఆనంద్ రాజ్
- సత్య కృష్ణన్
- పృథ్వీరాజ్
- తనికెళ్ళ భరణి
- నెల్లూరు సుదర్శన్
- శివన్నారాయణ
- సత్యకృష్ణ
- విజయ రంగరాజు
- రవివర్మ
- గుండు సుదర్శన్
- దేవియాని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్
- నిర్మాత: హేషన్ పాషా, డాక్టర్ బర్కతుల్లా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్
- ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్
- మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్
- కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నరనరము" | గోసాల రాంబాబు | మాల్గాడి శుభ[4] | 5:23 |
2. | "పో పోవే పో" | గోసాల రాంబాబు | శ్రేయ ఘోషాల్, యాజమాన్య | 5:03 |
3. | "అదే కావాలి" | గోసాల రాంబాబు | ఐశ్వర్య | 3:54 |
4. | "గిర గిర ప్రమోషనల్ సాంగ్" | గోసాల రాంబాబు | రాజలక్ష్మీ[5] | 3:50 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (22 February 2024). "సస్పెన్స్ థ్రిల్లర్ 'ఇంటి నెం 13'". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Chitrajyothy (5 March 2024). "Inti Number 13: 72 థియేటర్లతో స్టార్ట్.. 120 థియేటర్లలో హల్‌చల్ చేస్తున్న 'ఇంటి నెం.13'". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Sakshi (1 March 2024). "ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Chitrajyothy (29 January 2022). "'నరనరమూ'.. హుషారెక్కించే పాటతో మాల్గాడి శుభ రీ ఎంట్రీ". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Sakshi (24 February 2024). "'పుష్ప'ఫేం రాజలక్ష్మీ నోట 'ఇంటి నెం.13' పాట". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.