ఇండికా డి సారమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండికా డి సారమ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సమంతా ఇండికా డి సారమ్
పుట్టిన తేదీ (1973-09-02) 1973 సెప్టెంబరు 2 (వయసు 50)
మాతర, శ్రీలంక
బ్యాటింగుశ్రీలంక
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 80)1999 నవంబరు 18 - జింబాబ్వే తో
చివరి టెస్టు2000 మార్చి 12 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 100)1999 ఆగస్టు 22 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2001 ఏప్రిల్ 20 - పాకిస్తాన్ తో
ఏకైక T20I (క్యాప్ 27)2009 ఫిబ్రవరి 10 - భారతదేశం తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 4 15 217 183
చేసిన పరుగులు 117 183 12,679 4,553
బ్యాటింగు సగటు 23.40 16.63 39.13 28.63
100లు/50లు 0/0 0/0 28/68 4/30
అత్యుత్తమ స్కోరు 39 38 237 138
వేసిన బంతులు 1,912 652
వికెట్లు 27 11
బౌలింగు సగటు 43.33 43.90
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/27 2/5
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/– 236/8 71/2
మూలం: Cricinfo, 2015 జూన్ 10

సమంతా ఇండికా డి సారమ్, శ్రీలంక మాజీ క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్. సాధారణంగా వికెట్ కీపర్ గా కూడా చేశాడు.[1]

జననం[మార్చు]

సమంతా ఇండికా డి సారమ్ 1973, సెప్టెంబరు 2న శ్రీలంకలోని మతరలో జన్మించాడు. మాతరలోని సెయింట్ థామస్ కళాశాలలో చదివాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

తన పాఠశాల జట్టు కోసం వికెట్ కీపింగ్ తోపాటు, బ్యాటింగ్ లో భారీ సంఖ్యలో పరుగులు సాధించాడు. దేశంలో ప్రతిభ కలిగిన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇందులో అతను ఒక్కడే 149 బంతుల్లో 304 పరుగులు చేశాడు. అయినప్పటికీ, ఇతడు టెస్టు మ్యచ్ లు ఆడుతున్నప్పుడు ఇతని ప్రతిభను నిరూపించుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఇతడు దాదాపు ఆరు సంవత్సరాలుగా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు, బదులుగా ట్వంటీ 20 క్రికెట్ రంగాలను ఎంచుకున్నాడు. అతను 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో గాలే క్రికెట్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2]

ఇతను బంగ్లాదేశ్ ఎన్సిఎల్ T20 బంగ్లాదేశ్‌లో సుల్తాన్స్ ఆఫ్ సిల్హెట్ తరపున కూడా ఆడాడు.

హాంకాంగ్ క్రికెట్ సిక్స్‌ల పోటీకి శ్రీలంక జట్టులో నిరంతర సభ్యుడిగా ఉన్నాడు. 2007లో ఇతని కెప్టెన్సీలో శ్రీలంక టోర్నమెంట్‌ను గెలుచుకుంది.[3]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

శ్రీలంక జట్టులో చాలామంది బ్యాట్స్‌మన్‌ల కారణంగా జట్టులో, వెలుపల సభ్యుడిగా ఉన్నాడు. శ్రీలంకకు వన్డేల్లో 100వ క్యాప్‌గా నిలిచాడు.

2001లో అంతర్జాతీయ జట్టు నుండి తొలగించబడిన తర్వాత, 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 కొరకు 2009లో ట్వంటీ20 అంతర్జాతీయ జట్టులోకి తీసుకురాబడ్డాడు. భారత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం ఆడాడు.[4] ఇతడు రిటైర్మెంట్ వరకు ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Indika de Saram Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-18.
  3. "All Stars fumble against champions Sri Lanka". ESPNcricinfo. Retrieved 2023-08-18.
  4. "SL vs IND, India tour of Sri Lanka 2008/09, Only T20I at Colombo, February 10, 2009 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
  5. "de Saram ready to hold his own". ESPNcricinfo. Retrieved 2023-08-18.
  6. "de Saram added to World Twenty20 squad". ESPNcricinfo. Retrieved 2023-08-18.

బాహ్య లింకులు[మార్చు]