ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సూరత్
నినాదం | జ్ఞానం, కృషి ఎల్లప్పుడూ గౌరవించబడతాయి |
---|---|
రకం | జాతీయ ప్రాధాన్యత విద్యాసంస్థ |
స్థాపితం | 2017 |
డైరక్టరు | ప్రొఫెసర్ జె.ఎస్. భట్ |
స్థానం | సూరత్, గుజరాత్, భారతదేశం 21°09′52″N 72°47′07″E / 21.164583°N 72.785239°E |
జాలగూడు | www.iiitsurat.ac.in |
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సూరత్ (ఐఐఐటీ సూరత్, ట్రిపుల్ ఐటీ సూరత్) అనేది గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా లాభాపేక్ష లేని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా క్రింద స్థాపించబడిన 20 ఐఐఐటీలలో ఇదీ ఒకటి. సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తాత్కాలిక ప్రాంగణం నుండి ఈ సంస్థ పనిచేస్తోంది.[1] రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ భాగస్వాములు గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్, కెమికల్స్, గుజరాత్ గ్యాస్, గుజరాత్ ఇన్ఫర్మేటిక్స్ సంయుక్తంగా దీనికి నిధులు సమకూర్చాయి.[2]
చరిత్ర
[మార్చు]భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 2017లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలో భాగంగా ఈ ఐఐఐటీ సూరత్ ను స్థాపించింది. భారత రాష్ట్రపతి, గుజరాత్ రాష్ట్ర గవర్నర్, పరిశ్రమ భాగస్వాముల మధ్య అవగాహన ఒప్పందంతో అసోసియేషన్ మెమోరాండం సంతకం చేయబడ్డాయి. సూరత్‌లో 50 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సూరత్ కలెక్టర్‌ను అభ్యర్థించింది. 2017 జూలై నుండి క్యాంపస్‌లో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లలో కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[3][4]
ప్రాంగణం
[మార్చు]సూరత్ జిల్లాలోని కమ్రెజ్‌లో గుజరాత్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో కొత్త విద్యా సదుపాయం అభివృద్ధిలో భాగంగా అదనపు సౌకర్యాలను, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
కోర్సులు
[మార్చు]విద్యా కార్యక్రమాలు
[మార్చు]కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బిటెక్ కోర్సులను మాత్రమే అందిస్తోంది.
మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తాజా అంశాలతోపాటు సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్‌లు, ఇతర స్ట్రీమ్‌లలో నైపుణ్యం సాధించేందుకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారుతూవుంటుంది.
ప్రవేశాలు
[మార్చు]పైన పేర్కొన్న కోర్సులకు జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం ఉంటుంది. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ నిర్వహిస్తుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "IIIT Surat". Archived from the original on 23 June 2017. Retrieved 2023-02-05.
- ↑ "Memorandum of Understanding" (PDF). Svnit.ac.in. Archived from the original (PDF) on 2019-03-03. Retrieved 2023-02-05.
- ↑ "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-05.
- ↑ "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-05.