Jump to content

ఇంతిఖాబ్ ఆలం

వికీపీడియా నుండి
ఇంతిఖాబ్ ఆలం
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1941-12-28) 1941 డిసెంబరు 28 (వయసు 82)
హోషియార్పూర్, పంజాబ్, ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి లెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 34)1959 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1977 మార్చి 4 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 3)1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1976 అక్టోబరు 16 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫక్లా
మ్యాచ్‌లు 47 4 489
చేసిన పరుగులు 1,493 17 14,331
బ్యాటింగు సగటు 22.28 8.50 22.14
100s/50s 1/8 0/0 9/67
అత్యధిక స్కోరు 138 10 182
వేసిన బంతులు 10,474 158 91,735
వికెట్లు 125 4 1,571
బౌలింగు సగటు 35.95 29.50 27.67
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 85
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 13
అత్యుత్తమ బౌలింగు 7/52 2/36 8/54
క్యాచ్‌లు/స్టంపింగులు 20/– 0/– 228/–
మూలం: ESPNCricinfo, 2013 జూన్ 11

ఇంతిఖాబ్ ఆలం ఖాన్ (జననం 1941, డిసెంబరు 28) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. 1959 నుండి 1977 వరకు 47 టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 1969 - 1975 మధ్యకాలంలో 17 టెస్టులకు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1969 - 1981 మధ్య సర్రే తరపున ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో కూడా ఆడాడు. అందకుముందు ఇంటిఖాబ్ గ్లాస్గోలోని వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్ క్రికెట్ క్లబ్‌లో చాలా సంవత్సరాలపాటు సభ్యుడిగా ఉన్నాడు. గ్లాస్గో అకాడమీలో కోచ్‌గా కూడా ఉన్నాడు. 1967 ఆగస్టులో, ఓవల్‌లో ఆసిఫ్ ఇక్బాల్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది దాదాపు 30 ఏళ్ళుగా ప్రపంచ రికార్డుగా మిగిలిపోయింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ఇంతిఖాబ్ పాకిస్థాన్ తొలి వన్డే అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్. కెప్టెన్‌గా 3 మ్యాచ్‌లు ఆడాడు. రెండు మ్యాచ్ లలో గెలవగా, ఒకదానిలో ఓడిపోయాడు. 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 జట్టుతోపాటు 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు.

2004లో, రంజీ ట్రోఫీలో పంజాబ్‌కు కోచ్‌గా, దేశీయ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.

2008 అక్టోబరు 25న ఆస్ట్రేలియన్ జియోఫ్ లాసన్ పాకిస్తాన్ జాతీయ కోచ్‌గా తొలగించబడిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేత మరోసారి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా నియమించబడ్డాడు.[2]

2009లో, ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి పాకిస్తాన్ తమ మొదటి ట్వంటీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను పొందినప్పుడు ఇంతిఖాబ్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Intikhab Alam's record 9th wicket partnership". ESPNcricinfo. 28 August 2016. Retrieved 2023-09-08.
  2. "Intikhab Alam offered coach's role". ESPNcricinfo. 25 October 2008. Retrieved 2023-09-08.

బాహ్య లింకులు

[మార్చు]