ఇందిర మందలపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందిర మందలపు ప్రసిద్ధ రంగస్థల నటి.

జననం

[మార్చు]

1935 ఏప్రిల్ లో మహాలక్ష్మమ్మ, వెంకయ్య దంపతులకు గుంటూరు జిల్లా, వేమూరుకు సమీపంలోని మొసలిపాడులో జన్మించారు.

రంగస్థల ప్రవేశం

[మార్చు]

1953 పల్లేపడుచు నాటకంలోని రమాదేవి పాత్రతో రంగప్రవేశం చేశారు. జనతా ఆర్ట్ థియేటర్స్, క్రాంతి థియేటర్స్, ప్రజా నాట్యమండలి మొదలైన నాటక సమాజాల్లో ప్రధాన పాత్రతు ధరించి అనేక బహుమతులు పొందారు.

నటించిన నాటకాలు - పాత్రలు

[మార్చు]
  1. పల్లెపడుచు - రమాదేవి
  2. పునర్జన్మ - శ్యామల
  3. భయం - టైపిస్టు పార్వతి
  4. కప్పలు - పంకజం
  5. శిక్షార్హులు - జానకమ్మ
  6. ఆనాడు - సంయుక్త
  7. పల్నాటి యుద్ధం - మాంచాల
  8. రామరావణ యుద్ధం - సీత
  9. భూకైలాస్ - మండోదరి

మూలాలు

[మార్చు]