ఇనపరాజుపల్లి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఇనపరాజుపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′57″N 79°46′03″E / 16.399201°N 79.76738°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | కారంపూడి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి చల్లా ఏశ్వరమ్మ |
పిన్ కోడ్ | 522614 |
ఎస్.టి.డి కోడ్ |
ఇనపరాజుపల్లి , పల్నాడు జిల్లా కారంపూడి మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]ఇనపరాజుపల్లి. ఈ గ్రామానికి పేరు పెట్టినది బొమ్మారెడ్డి మాచిరెడ్డి అనే జమీందార్. ఈయన తంగెడ గ్రామానికి చెందినవాడు. ఒకసారి ఈ జమీందార్ కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్తుంటె మార్గ మధ్యంలో వారి బండి ఇరుసు (ఇనప ఇరుసు) విరిగిపోయింది. అక్కడ వారికి రెండు గుడిసెలు కనిపించెను. ఈ ఊరి పేరు ఏమిటి అని అక్కడ వారిని అడిగెను. వారిలో కాటమ రాజు అనే అతను - అయ్యా నా పేరు కాటమ రాజు, ఇది ఊరు కాదు, మేము బ్రతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చాము అని సమాధానమిచ్చెను. వెంటనే ఆ జమీందార్ - చాలా గట్టిదైన బండి ఇనప ఇరుసు ఇక్కడ విరిగింది కావున ఇనపరాజుపల్లి అనే పేరుతో ఇక్కడ ఒక గ్రామం ఏర్పడుతుంది అని జోస్యం చెప్పారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చల్లా ఈశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.
- ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి, 2016, ఫిబ్రవరి-3న శంకుస్థాపన నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు