ఇనుకొండ తిరుమలి
ఇనుకొండ తిరుమలి | |
---|---|
జననం | |
వృత్తి | విద్యావేత్త, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణ ఉద్యమం |
ఇనుకొండ తిరుమలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చరిత్రకారుడు,[1][2] ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమకారుడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యుడు పనిచేసిన తిరుమలి,[3] తెలంగాణ ప్రజా సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[4]
జననం, విద్య
[మార్చు]తిరుమలి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పెద్దగోపతి గ్రామంలో జన్మించాడు. తిరుమలి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని చరిత్ర విభాగంలో ఎంఏ పూర్తిచేశాడు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని హిస్టారికల్ స్టడీస్ సెంటర్ నుండి తెలంగాణ వ్యవసాయ సంబంధాలపై ఎంఫిల్, తెలంగాణ రైతాంగ ఉద్యమంపై పిహెచ్‌డి చేశాడు.[5]
వృత్తిరంగం
[మార్చు]తిరుమలి ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల చరిత్ర విభాగంలో 1980 నుండి 30 సంవత్సరాలపాటు ఆచార్యుడిగా పనిచేశాడు.[1] 1984-86, 2001-2003, 2006-2008 మధ్యకాలాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలలోని చరిత్ర విభాగంలో టీచర్-ఇన్-చార్జ్ గా ఉన్నాడు. తెలంగాణ, తెలంగాణలో భూస్వామ్య విధానంపై పలు పుస్తకాలు రాశాడు.[6]
రాసిన పుస్తకాలు
[మార్చు]- తిరగబడ్డ తెలంగాణ (దొరలకు దించాం - నిజాంలను కూల్చాం): తెలంగాణలో ప్రజా ఉద్యమం 1939-1948[7]
- వివాహం, ప్రేమ, కులం: వలస పాలనాకాలంలో తెలుగు మహిళలపై అవగాహన
- దక్షిణ భారత ప్రాంతాలు, సంస్కృతులు, సాగాలు
- అణచివేయబడిన ఉపన్యాసాలు: ప్రొఫెసర్ సభ్యసాచి భట్టాచార్య గౌరవార్థం వ్యాసాలు
పరిశోధన పత్రాలు
[మార్చు]- దొర-గడి: తెలంగాణలో భూస్వామ్య ఆధిపత్య అభివ్యక్తి
- తెలంగాణాలోని నల్గొండ, వరంగల్ జిల్లాలలో రైతువర్గ వాదనలు, 1930-1946 - ఇండియన్ ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ రివ్యూ, 31, నం 2 (1994)
పరిశోధన ఫెలో
[మార్చు]- జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, 1976-1980)
- టీచర్ ఫెలో (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ, 1988-1991)
- ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్‌లో సీనియర్ ఫెలో (న్యూఢిల్లీ, 1997 మే నుండి 1998 ఏప్రిల్ వరకు)
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జీవితకాల సభ్యుడు
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ స్కూల్ పాఠ్య రచయిత, హైదరాబాద్, 1994-97
- ఢిల్లీ విశ్వవిద్యాలయం బి.ఏ (ఆనర్స్) చరిత్ర కోర్సు కమిటీ 1997
- పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ సభ్యుడు, హైదరాబాద్
- తెలంగాణ మేధావుల ఫోరం వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Gadar to release book on Telangana - ANDHRA PRADESH". The Hindu. 2008-01-09. Retrieved 2022-02-28.
- ↑ "'Aristocrats part of the Freedom Struggle'". Deccan Chronicle. 18 July 2020.
- ↑ "సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర్య పోరాటం కాదు!". lit.andhrajyothy.com. Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.
- ↑ "India News, Latest Sports, Bollywood, World, Business & Politics News". The Times of India. Archived from the original on 2012-11-05. Retrieved 2022-02-28.
- ↑ "Archived copy". svc.ac.in. Archived from the original on 22 May 2011. Retrieved 2022-02-28.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ (February 29, 1992). "Dora and Gadi: Manifestation of Landlord Domination in Telengana".
- ↑ "Tiragabadda Telangana - తిరగబడ్డ తెలంగాణ by Inukonda Tirumali - Tiragabadda Telangana". anand books (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.