Coordinates: 16°21′07″N 79°04′15″E / 16.35195°N 79.07075°E / 16.35195; 79.07075

ఇప్పలపల్లి (మహబూబ్ నగర్ గ్రామీణ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇప్పలపల్లి,తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (గ్రామీణ) మండలంలోని గ్రామం.[1]

ఇప్పలపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
ఇప్పలపల్లి is located in తెలంగాణ
ఇప్పలపల్లి
ఇప్పలపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′07″N 79°04′15″E / 16.35195°N 79.07075°E / 16.35195; 79.07075
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మహబూబ్ నగర్ (గ్రామీణ)
ప్రభుత్వం
 - Type గ్రామ పంచాయితీ
 - సర్పంచి బంగారు వెంకటయ్య (25 జనవరి 2019 నుంచి) ఉపసర్పంచ్: బజారు లక్ష్మీదేవమ్మ
జనాభా (2011)
 - మొత్తం 1,736
 - పురుషుల సంఖ్య 871
 - స్త్రీల సంఖ్య 865
 - గృహాల సంఖ్య 342
పిన్ కోడ్ గాజులపేట 509382
ఎస్.టి.డి కోడ్

ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని భూత్‌పూర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ మండలం (రూరల్) లోకి చేర్చారు. [2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 342 ఇళ్లతో, 1736 జనాభాతో 921 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 871, ఆడవారి సంఖ్య 865. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 372 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 575540.[3]

గ్రామ చరిత్ర[మార్చు]

ఇప్పలపల్లి అనే ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారా? ఈ గ్రామంలో పూర్వం ఇప్పచెట్లు ఎక్కువగా ఉన్నందున, ఈ గ్రామానికి ఇప్పలపల్లి అనే పేరు వచ్చిందని గ్రామస్థులు తెలుపుతున్నారు.

రాజకీయాలు[మార్చు]

2019 జనవరిలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా బంగారు వెంకటయ్య ఎన్నికయ్యాడు.అలాగే ఉప సర్పంచ్ గా బజారు లక్ష్మీదేవమ్మ ఎన్నికయ్యారు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది.ఈ పాఠశాలలో 1 నుంచి 8 వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో బోదిస్తారు. 9,10 వ తరగతులకు గాజులపేటకు నడిచి వెళ్ళాలి.కళాశాల చదువుల కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వెళ్ళాలి. రవాణా సదుపాయం లేక కొందరు చదువుకు దూరమయ్యారు. మరికొందరు ప్రైవేట్ ఆటోలో వెళ్లి చదువుకుంటున్నారు.సమీప జూనియర్ కళాశాల భూత్‌పూర్‌లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు మహబూబ్ నగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ మహబూబ్ నగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మహబూబ్ నగర్లో ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి అనే పేరుగల ఇంటర్నెట్ & జిరాక్స్ సెంటర్ ఉంది.

గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.అటు జాతీయ రహదారి 44 , జాతీయ రహదారి 167 ఉన్న గ్రామానికి ఎటువంటి బస్సు సౌకర్యం లేదు.ఈ గ్రామానికి చేరుకోవాలంటే మహబూబ్ నగర్ లోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న హాబీబ్ హోటల్ వద్ద ప్రైవేట్ ఆటోలు ఉంటాయి. అక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇప్పలపల్లి గ్రామం నుండి గాజులపేట మీదుగా 44వ జాతీయ రహదారి (యన్.ఎచ్.5) 5 కి.మీ. దూరంలో ఉంటుంది.అలాగే ఇప్పలపల్లి నుంచి రాయచూరు రోడ్ (వయా జమిస్తాపూర్, తెలుగు గూడెం, కోడూరు) 7 కి. మీ. దూరం ఉంటుంది. అక్కడి నుంచి మన్యంకొండ, దేవరకద్ర, నారాయణపేట మీదుగా, రాయచూరుకు వెళ్ళవచ్చుగ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఇప్పలపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 11 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 175 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 22 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 6 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 14 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 104 హెక్టార్లు
 • బంజరు భూమి: 332 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 256 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 588 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 104 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఇప్పలపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 54 హెక్టార్లు* చెరువులు: 50 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఇప్పలపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

మొక్కజొన్న, ఆముదం, ప్రత్తి

గ్రామంలో దేవాలయాలు[మార్చు]

 • ఆంజనేయస్వామి దేవాలయం
 • మల్లికార్జున స్వామి దేవాలయం
 • మొరగట్టు లింగమయ్య స్వామి,
 • ఎల్లమ్మ తల్లి దేవస్థానం

పూర్వం నుంచి గ్రామంలోని వారితో పాటు గాజులపేట, తాటికొండ, పాలమూరు నుండి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ, తర్వాత నుండి అమ్మ వారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.ఏరువాక పున్నమి వరకు ఎల్లమ్మ ఉత్సవాలు కొనసాగుతాయి.

ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, ఉత్సవాలలో అడుగుల భజనలు, కోలాటాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.వినాయక చవితి ఉత్సవాల లడ్డు మండలంలోనే వేలంలో ఎక్కువ ధరకు పోతుంది.

ఇప్పలపల్లి పీర్ల పండుగ[మార్చు]

మహబూబ్ సుబాన్ దర్గా, పీర్ల చావిడి (హుస్సేన్ పీరు, ఖాసీం పీరు, మౌలాలి పీర్లు). ఖాసీమ్ పీరు: ఈ హుస్సేన్ పీరుకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఉశేనయ్య గౌడ్ కుటుంబం వారు పీరును ఎత్తేవారు. పీర్ల పండుగలో అలాయ్ చిన్న పెద్ద బేధం లేకుండా ఆశన్న ఉషన్న , భీమ్ ఫాతిమా, ఖాసీం పాటలు పాడుతూ బాగా ఆడతారు. ప్రస్తుతం ఈ పీర్లను రామకృష్ణ గౌడ్ (హుస్సేన్) , ఖాసీమ్ పీర్, పెంటన్న ఎత్తుతున్నారు.

ఇప్పలపల్లి పీర్ల పండుగ ప్రత్యేకత[మార్చు]

గ్రామంలోని పీర్లకు ఒక ప్రత్యేకత ఉంది హుస్సేన్ పాషా పీరు, మౌలాలీ పీర్లు 7 రోజుల నాడు ఈ గ్రామం నుంచి ప్రక్కన ఉన్న జమిస్తాపూర్ అనే గ్రామానికి వెళ్లి అలాయి బలాయి ఇచ్చి వస్తుంది అలాగే మరుసటి రోజు 9వ రోజున జమిస్తాపూర్ గ్రామం నుంచి పీర్లు వచ్చి ఇక్కడ అలాయి బలాయి తీసుకుని వెళ్తుంది.ఈ సన్నివేశంలో మళ్ళీ మనం సంవత్సరానికి కలుస్తాం అని దుఃఖంతో,బాధతో రెండు గ్రామాల పీర్లు మాట్లాడుకుంటుంటే ఇరువురి గ్రామస్తులు కూడా కన్నీటి వీడ్కోలు చెప్పి మరునాడు 10వ రోజైనా బాధతో కన్నీటితో హుస్సేన్ పీరును, మౌలాలీ పీరును ఊరి చివర ఉన్న బావి దగ్గరకు తీసుకువెళ్లి వాటిని శుభ్రం చేసి పీర్ల పేటికెలో ఉంచుతారు. దీని తరువాత ఇమామ్ ఖాసీం పీరు కౌటి పీరును పెడతారు దీనికి కూడా అగ్నిగుండం తొక్కడంలో ఈ పీరుకు సాటి లేదు ఈ అగ్నిగుండంలో నడవడానికి చుట్టుప్రక్కల గ్రామాల వారు వస్తారు ఇది ఇప్పలపల్లి పీర్ల పండుగ. సవార్లు: హుస్సేన్ పీరు:రామకృష్ణ గౌడ్ మౌలాలీ పీరు: హుస్సేన్ ఇమామ్ ఖాసీం పీరు: పెంటయ్య పీర్ల పండుగ పెద్దలు : బజారు వెంకటయ్య,ఉశేనయ్యగౌడ్

ఇప్పలపల్లి పీర్ల పండుగ వేళలు[మార్చు]

ఇప్పలపల్లి పెద్ద పీర్ల పండుగ తేదీలు 2020 ఆగష్టు 26 నాడు 7 రోజుల సవారీ, 2020 ఆగష్టు 28 నాడు 9 రోజుల సవారీ,2020 ఆగష్టు 29 నాడు మొహర్రం/ఆశురా★ పై తేదీలు హుస్సేన్, మౌలాలీ పీరుకు సంబంధించినది.దీని తరువాత కౌటి పీర్ల పండుగ జరుగును

ఇప్పలపల్లి కౌటి పీర్ల పండుగ వేళలు[మార్చు]

కౌటి పీర్ల పండుగ తేదీలు ఇమామ్ ఖాసీం పీరు 18 సెప్టెంబర్ 2019 7 రోజుల సవారీ 20 సెప్టెంబర్ 2019 9 రోజుల సవారీ, అగ్ని గుండం జరుగును 21 సెప్టెంబర్ 2019 10వ మొహర్రం/ఆశురా

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]