ఇవాన్స్ చైల్డ్‌హుడ్ (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇవాన్స్ చైల్డ్‌హుడ్
ఇవాన్స్ చైల్డ్‌హుడ్ సినిమా పోస్టర్
దర్శకత్వంఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
స్క్రీన్ ప్లేవ్లాదిమిర్ బోగోమోలోవ్, మిఖాయిల్ పాపావ,ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
తారాగణంనికోలాయ్ బుర్లీయేవ్, వాలెంటిన్ జుబ్కోవ్, ఎవ్వని జర్రికోవ్, స్టెపాన్ క్రిల్లోవ్, నికోలాయ్ గ్రింకో
ఛాయాగ్రహణంవాడిమ్ యుసోవ్
కూర్పులియుడ్మిలా ఫీగిన్నోవా
సంగీతంవ్యాచెస్లావ్ ఓవ్చిన్నికోవ్
పంపిణీదార్లుమోస్ ఫిల్మ్
విడుదల తేదీ
6 ఏప్రిల్ 1962 (1962-04-06)
సినిమా నిడివి
94 నిముషాలు[1]
దేశంసోవియెట్ యూనియన్
భాషరష్యన్ భాష

ఇవాన్స్ చైల్డ్‌హుడ్ 1962, ఏప్రిల్ 6న విడుదలైన రష్యా (సోవియెట్ యూనియన్) చలనచిత్రం. ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ దర్శకత్వంలో బాల నటుడు నికోలాయ్ బుర్లీయేవ్, వాలెంటిన్ జుబ్కోవ్, ఎవ్వని జర్రికోవ్, స్టెపాన్ క్రిల్లోవ్, నికోలాయ్ గ్రింకో, తార్కోవ్ స్కీ భార్య ఇర్మా రౌష్ నటించిన ఈ చిత్రం వ్లాదిమిర్ బోగోమోలోవ్ అనే రచయిత 1957లో రాసిన ఇవాన్ అనే కథ ఆధారంగా రూపొందించబడింది. ఒక యుద్ధ వాతావరణాన్ని చూపిస్తూ , ఆ యుద్ధంలో తల్లిని తండ్రిని కుటుంబాన్ని కోల్పోయిన పండ్రెండేళ్ల బాలుడి కథ నేపథ్యంలో ఈ ఇవాన్స్ చైల్డ్‌హుడ్ సినిమా తెరకెక్కింది.

కథా నేపథ్యం

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధంలో ఇవాన్ బండారేవ్ అనే 12 ఏళ్ల కుర్రాడు రష్యా సైన్యంలో సైనికుడిగా చేరతాడు. చిన్న కుర్రాడు నాజీలకు అనుమానం రాదని భావించిన రష్యా సైన్యం ఆ కుర్రోన్ని నిఘా కోసం గూఢచారిగా పంపుతుంది. రహస్యాలను ఎంతో నేర్పుతో తెచ్చే ఆ కుర్రాణ్ణి లెఫ్టినెంట్ గల్ట్ సేవ్, ఇంకొందరు సైనికులు ఎంతో ఇష్టపడతారు. ఆ అబ్బాయి నాజీల మీద ప్రతీకారంతో రగిలిపోతూ తను చేయలేని తీర్చుకోలేని పగని రష్యా సైనికులకు సహాయం చేయడం ద్వారా తీర్చుకోవచ్చని భావిస్తుంటాడు. అతన్ని అందుకు దూరంగా ఉంచాలని మిలటరీ స్కూల్లో వేసిన ,చిల్డ్రన్ స్కూల్లో వేసినా పారిపోయి వస్తానని చాలా సూటిగా కోపంతో రగిలిపోయే ఇవాన్ చెబుతుంటాడు. తనని మిలటరీ స్కూల్ కి పంపినా పారిపోయి వస్తానన్న ఇవాన్ చివరగా ఒక మిషన్ కోసం వెళ్తాడు. కానీ అతడెప్పుడు ఇక తిరిగిరాడు. ఆ యుద్ధం ఆ కుర్రవాడికి ఎన్ని భయంకరమైన కలల్ని మిగిలిస్తుందో సినిమాలో చూడొచ్చు. నాజీల పరాజయం తర్వాతా రష్యాన్ని స్వాధీనం చేసుకుని దేశంలోకి ప్రవేశించిన రష్యన్ సైనికులు ఇవాన్ అమరుడవడాన్ని ఒక ఫైల్ లో చూపిస్తూండడం అతడి మరణానంతరం అతడి కలని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]
 • నికోలాయ్ బుర్లీయేవ్
 • వాలెంటిన్ జుబ్కోవ్
 • ఎవ్వని జర్రికోవ్
 • స్టెపాన్ క్రిల్లోవ్
 • నికోలాయ్ గ్రింకో
 • ఇర్మా రౌష్
 • డిమిట్రీ మిలియుటెంకో
 • వాలెంటిన మలైనానా
 • ఆండ్రీ కొంచాలోవ్స్కి

సాంకేతికవర్గం

[మార్చు]
 • దర్శకత్వం: ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
 • స్క్రీన్ ప్లే: వ్లాదిమిర్ బోగోమోలోవ్, మిఖాయిల్ పాపావ,ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ
 • ఆధారం: వ్లాదిమిర్ బోగోమోలోవ్ అనే రచయిత 1957లో రాసిన ఇవాన్ అనే కథ
 • సంగీతం: వ్యాచెస్లావ్ ఓవ్చిన్నికోవ్
 • ఛాయాగ్రహణం: వాడిమ్ యుసోవ్
 • కూర్పు: లియుడ్మిలా ఫీగిన్నోవా
 • పంపిణీదారు: మోస్ ఫిల్మ్

విడుదల - స్పందన

[మార్చు]

1962, ఏప్రిల్ 6న విడుదలైన ఈ చిత్రం, సోవియట్ యూనియన్ లో 16.7 మిలియన్ టికెట్లు అమ్ముడై, విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది.[2]

ఇతర వివరాలు

[మార్చు]
 1. ఇవాన్స్ చైల్డ్‌హుడ్ సినిమా ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ తొలి సినిమా.
 2. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకోవడమేకాకుండా, తార్కోవ్ స్కీ కి అంతర్జాతీయంగా గుర్తింపును ఇచ్చింది.
 3. ఈ చిత్రం 1962లో వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ లయన్ అవార్డు, శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ గేట్ అవార్డులను గెలుచుకుంది.
 4. ఈ చిత్రం 36వ ఆస్కార్ అవార్డులలో సోవియట్ యూనియన్ నుండి ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ప్రతిపాదించబడింది. కాని నామినేట్ చేయబడలేదు.[3]
 5. సినీ నిర్మాతలైన ఇంగర్ బెర్గ్మన్, సెర్గీ పరాజనోవ్, క్రిజిటోఫ్ కీస్లోవ్స్కి తదితరులు ఈ చిత్రంను ప్రశంసించడమేకాకుండా, వారిపై ఈ సినిమా ప్రభావం ఉందని తెలిపారు.[4]

మూలాలు

[మార్చు]
 1. "IVAN'S CHILDHOOD (A)". British Board of Film Classification. 29 November 1963. Retrieved 14 April 2019.
 2. Segida, Miroslava; Sergei Zemlianukhin (1996). Domashniaia sinemateka: Otechestvennoe kino 1918-1996 (in రష్యన్). Dubl-D.
 3. Margaret Herrick Library, Academy of Motion Picture Arts and Sciences
 4. Daly, Fergus; Katherine Waugh. "Ivan's Childhood". Senses of Cinema. Archived from the original on 14 ఏప్రిల్ 2019. Retrieved 14 April 2019.

ఇతర లంకెలు

[మార్చు]