ఇసుదాన్ గాధ్వి
ఇసుదాన్ గాధ్వి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం జూన్ 2021 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | పిపాలియా గ్రామం, దేవభూమి ద్వారక జిల్లా, గుజరాత్, భారతదేశం | 1982 జనవరి 10||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
పూర్వ విద్యార్థి | గుజరాత్ విద్యాపీఠ్ (జర్నలిజంలో మాస్టర్స్) & (మాస్ కమ్యూనికేషన్) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు • జర్నలిస్ట్ • ఎడిటర్ • న్యూస్ యాంకర్ | ||
వెబ్‌సైటు | ట్విట్టర్ లో ఇసుదాన్ గాధ్వి |
ఇసుదాన్ గాధ్వి భారతదేశానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తున్నాడు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేయబోయే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గాధ్వి పేరును 2022 నవంబర్ 04న ఖరారైంది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఇసుదాన్ గాధ్వి 1982 జనవరి 10న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం, ఇటాలియా ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన జామ్ ఖంభాలియాలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి, 2005లో గుజరాత్ విద్యాపీఠ్ నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పట్టభద్రుడయ్యాడు.[2]
జర్నలిస్టుగా
[మార్చు]ఇసుదన్ గాధ్వి మాస్టర్స్ పూర్తి చేసి గుజరాత్‌లో దూరదర్శన్‌లో చేరి అక్కడ ఓ షో చేసి ఆ తర్వాత పోర్‌బందర్‌లోని 'ఈటీవీ గుజరాతీ' ఛానెల్‌లో రిపోర్టర్‌గా పని చేశాడు. ఆయన 2015లో ఈశుదాన్ అహ్మదాబాద్‌లోని ఓ ప్రముఖ గుజరాతీ ఛానెల్‌కు ఎడిటర్‌గా చేరి, 'మహామంథన్' పేరుతో ఓ షోను ప్రారంభించి యాంకర్‌గా వ్యవహరించాడు. ఈ షోతో ఆయన ప్రజా సమస్యల విషయంలో తన గళాన్నివినిపించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఇసుదన్ గాధ్వి రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావాలన్న ఆశయంతో 2021 జూన్‌లో మీడియా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గులాబ్ సింగ్ యాదవ్‌ల ఆహ్వానం మేరకు అహ్మదాబాద్‌లో అరవింద్ కేజ్రివాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరగా ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఆయన 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖంభాలియా నియోజకవర్గం నుండి పోటీ చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (4 November 2022). "గుజరాత్‌లో ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ టీవీ యాంకర్". Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
- ↑ V6 Velugu (4 November 2022). "గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ యాంకర్". Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (14 November 2022). "ఖంభాలియా నుంచి పోటీ చేయనున్న ఆప్ సీఎం అభ్యర్థి". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.