ఈడుపుగంటి వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఐ.వి.సుబ్బారావు
జననం డిసెంబర్ 20, 1934
పసలపూడి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం ఆగష్టు 14, 2010
పౌరసత్వం భారతదేశం
జాతీయత ఇండియన్
జాతి హిందూ
రంగములు వ్యవసాయం
విద్యాసంస్థలు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఆల్మ మాటర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
ముఖ్యమైన అవార్డులు పద్మశ్రీ

ఈడుపుగంటి వెంకట సుబ్బారావు M.Sc. Ph.D. (20 December 1934 – 14 August 2010) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఇతను ఐ.వి.సుబ్బారావుగా సుపరిచితులు. అతను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అచ్చన్న మరియు మున్నెమ్మ. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ లో M.Sc. చేశాడు మరియు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ నుంచి తను Ph.D. పొందాడు. అతను వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టే ముందు విశ్వవిద్యాలయం లో పరిశోధన యొక్క డైరక్టర్ గా ఉన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి 2003 లో పదవీ విరమణ చేశారు.

ఈ విశ్వవిద్యాలయం దేశంలో మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయము దీనిని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తుంది.[1] అతను 2006 లో నిర్వహించిన 93 వ కాంగ్రెస్ కు జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

అతను 75 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 14, 2010 న క్యాన్సర్ తో మరణించారు.[2]

పురస్కారాలు[మార్చు]

  • అతను వ్యవసాయ రంగానికి చేసిన ప్రముఖ సేవలకు 2002 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
  • Dr. Norman E. Borlaug Award in 2004.
  • Ashutosh Mukherjee Memorial Award in 2007.

సూచికలు[మార్చు]