Jump to content

ఈడుపుగంటి వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
(ఈడ్పుగంటి వెంకట సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
ఐ.వి.సుబ్బారావు
జననండిసెంబర్ 20, 1934
పసలపూడి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణంఆగష్టు 14, 2010
పౌరసత్వంభారతదేశం
జాతీయతఇండియన్
జాతిహిందూ
రంగములువ్యవసాయం
వృత్తిసంస్థలుఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
ముఖ్యమైన పురస్కారాలుపద్మశ్రీ

ఈడుపుగంటి వెంకట సుబ్బారావు M.Sc. Ph.D. (డిసెంబర్ 20, 1934ఆగష్టు 14, 2010) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. ఐ.వి.సుబ్బారావుగా సుపరిచితమైన ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అచ్చన్న, మున్నెమ్మ. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ లో M.Sc. చేశాడు, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ నుంచి Ph.D. పొందాడు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టే ముందు విశ్వవిద్యాలయంలో పరిశోధన డైరక్టర్ గా ఉన్నాడు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి 2003 లో పదవీ విరమణ చేశాడు.

ఈ విశ్వవిద్యాలయం, ఈయన ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించి, దేశం లోనే, దీనిని నిర్వహించిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయముగా పేరు తెచ్చుకొన్నది.[1] అతను 2006 లో నిర్వహించిన 93 వ కాంగ్రెస్ కు జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.

అతను 75 సంవత్సరాల వయస్సులో 2010 ఆగష్టు 14 న క్యాన్సర్తో మరణించాడు.[2]

పురస్కారాలు

[మార్చు]
  • అతను వ్యవసాయ రంగానికి చేసిన ప్రముఖ సేవలకు 2002 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించాడు.
  • బోర్‌లోగ్ అవార్డు (2004).
  • అశుతోష్ ముఖర్జీ స్మారక అవార్డు (2007).

సూచికలు

[మార్చు]
  1. "Former V-C of ANGRAU dead in the Hindu". Archived from the original on 2010-08-19. Retrieved 2013-08-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-09. Retrieved 2013-08-11.