ఈరవత్రి అనిల్
ఈరవత్రి అనిల్ కుమార్ | |||
| |||
పదవీ కాలం 2024 జులై 8 – ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
తరువాత | వేముల ప్రశాంత్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | బాల్కొండ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 26 సెప్టెంబర్ 1973 కిసాన్ నగర్, బాల్కొండ, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ప్రజారాజ్యం పార్టీ | ||
నివాసం | హైదరాబాద్ |
ఈరవత్రి అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాల్కొండ నియోజకవర్గం 2009 నుండి 2014 వరకు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఈరవత్రి అనిల్ 1972లోతెలంగాణ రాష్ట్రం , నిజామాబాద్ జిల్లా, బాల్కొండలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో, హైదరాబాద్ హిమాయత్‌నగర్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్, గండిపేట్లోని సి.బి.ఐ.టి కాలేజ్ నుండి 1996లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.[2] అనిల్ బిటెక్ తరువాత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఈరవత్రి అనిల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి శనిగరం పై 8159 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం తరువాత ఆయన ప్రభుత్వ విప్‌గా నియమితుడయ్యాడు.[4]
ఈరవత్రి అనిల్ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆతరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 36248 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.[5] ఈరవత్రి అనిల్ ను 2024 జులై 8న తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ AP Online (2009). "List-of-MLAs 2009". Archived from the original on 2012-02-12. Retrieved 9 June 2022.
- ↑ Sakshi (5 November 2018). "కూటమి జోరు". Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.
కూటమి జోరు
- ↑ News18 (2018). "Balkonda Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 7 December 2021. Retrieved 7 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (8 July 2024). "తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.