ఉడిపి అనంతేశ్వర దేవాలయం
ఉడిపి అనంతేశ్వర దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉడిపి జిల్లా |
స్థలం | ఉడిపి |
సంస్కృతి | |
దైవం | అనంతేశ్వర , పరశురామ , (విష్ణు) |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | కేరళ ఆలయ వాస్తు నిర్మాణం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | సా.శ. 8 వ శతాబ్దం |
సృష్టికర్త | అలుపా రాజవంశీకులు |
వెబ్‌సైట్ | Shri Anantheswara temple |
ఉడిపి అనంతేశ్వర దేవాలయం, అనంతేశ్వర పరశురామ (విష్ణువు అవతారం) నకు అంకితం చేసిన చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఇది భారతదేశం , ఉడిపి జిల్లా, ఉడిపి నగరంలో ఉంది. పరశురాముడు లింగరూపంలో కొలువై ఉన్న ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన ఆలయం. [1] [2] రచయిత రోషెన్ దలాల్ గ్రంధాల ప్రకారం, " నగరం పరశురామ క్షేత్రంలో భాగంగా ఏర్పడింది. పరశురాముడు సముద్రం నుండి ఈ ప్రాంతాన్ని సేకరించినట్లు చెబుతారు. రామభోజుడు అనే రాజు ఇక్కడ పరశురాముడిని లింగ రూపంలో పూజించాడని, ఆ తర్వాత వెండిఆసనం (రజత పిఠం)పై కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువలన సంస్కృత గ్రంథాలలో, ఈ నగరాన్ని రజత పిఠ అని పిలుస్తారు" [3] ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారనే నమ్మకం కూడా ఉంది.
ఈ ఆలయం సా.శ. 8వ శతాబ్దంలో అలుపాస్ పాలనలో పునరుద్ధరించబడింది.తుళునాడు ప్రాంతంలోని పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.అనంతేశ్వర దేవాలయం, చంద్రమౌళీశ్వర శివుని ఆలయానికిసమీపంలోఉంది.
ఉడిపిలోని అష్ట మఠాలలో ఒకటైన పుట్టిగే మఠం నిర్వహించే ఈ ఆలయం ఉడిపిలోని పురాతనమైంది. [4] జగద్గురువులు మధ్వాచార్యులు అనేక తత్త్వవాద వ్రాతలను రచించి,దానిని తన శిష్యులకు బోధించి, భగవంతుడు వేదవ్యాసునితో పాటు బదరీకి అదృశ్యం పొందిన ప్రదేశంగా భావిస్తారు.[5] [6]
మూలాలు
[మార్చు]- ↑ G. Kameshwar (2004). Tulu Tales: A Soota Chronicle. Rupa & Company. p. 31. ISBN 9788129104274.
The association of Parasurama, an incarnation of Vishnu, with the Linga, came to be known as Anantheshwara and the place of worship is the present Anantheshwara temple.
- ↑ "Steeped in history, the region is a pilgrim's delight". The Hindu. Retrieved 18 April 2015.
- ↑ Roshen Dalal (18 April 2014). Hinduism: An Alphabetical Guide. Penguin UK. p. 1267. ISBN 9788184752779.
- ↑ "Udupi: Internal differences between Swamijis of eight Maths pour out into open". Daijiworld News. 10 June 2015.
- ↑ Keshavadas (1972). The Doctrine of Reincarnation and Liberation. Dasashrama Research Publications. p. 77.
It also creates awe and wonder to know that Madhwa disappeared in the air from Udipi Ananteshwara Temple while he was lecturing on the Aitaraya Upanishad which is why it is known that he was the incarnation of the wind god.
- ↑ C. Panduranga Bhatta; G. John Samuel (1997). Contribution of Karaṇāṭaka to Sanskrit. Institute of Asian Studies. p. 352.