ఉద్యోతకారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉద్యోతకారుడు సా.శ. 6 వ శతాబ్దానికి చెందిన న్యాయ దార్శనికుడు. న్యాయ తత్వశాస్త్రం మీద వ్యాఖ్యాత. ఇతను న్యాయ సూత్రాలపై న్యాయవార్తిక అనే గ్రంథాన్ని రాసాడు. ఇది భారతీయ తర్కశాస్త్రాభివృద్ధికి దోహదం చేసిన గొప్ప గ్రంథాలలో ఒకటి. ఇది వాత్సాయనుడి (కామసూత్ర గ్రంథ కర్త కాదు) న్యాయ భాష్యాన్ని సమర్ధిస్తూ, దిజ్ఞాగుని బౌద్ధ తర్కాన్ని విమర్శిస్తూ రాయబడింది.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఉద్యోతకారుడు బ్రాహ్మణుడు. భరద్వాజ గోత్రికుడు. పాశుపత శాఖీయుడు. ఇతని గ్రంథంలో పేర్కొన్న ఇతని స్థలం శృఘ్న (Shrughna).[2] ఇది ప్రస్తుత హర్యానా లోని యమునా నగర్ సమీపంలోని 'సుఘ్' (sugh) గ్రామంగా గుర్తించబడింది. అంతకు మించి ఇతని విశేషాలు ఎక్కువగా తెలియవు.

ఉద్యోతకారుడు రాసిన గ్రంథం 'న్యాయవార్తిక'. ఇది ప్రసిద్ధ బౌద్ధ తర్కవేత్త దిజ్ఞాగుడు రాసిన 'ప్రమాణ సముచ్చయం' లోని బౌద్ధ తర్కాన్ని విమర్శిస్తూ రాయబడింది. ఉద్యోతకారుడు రూపొందించిన న్యాయ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తూ, అతని వాదనా సరళిని సమర్ధిస్తూ అనంతరకాలంలో వాచస్పతి మిశ్ర (సా.శ. 9 వ శతాబ్దం) 'న్యాయవార్తిక తాత్పర్యటీక' అనే గ్రంథాన్ని రాయడం జరిగింది.

రిఫరెన్సులు

[మార్చు]
  • సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతీయ తత్వ శాస్త్రం - 3 (2011 ed.). Hyderabad: Peacock Classics.

మూలాలు

[మార్చు]
  1. Radhakrishnan, S. Indian Philosophy, Vol. II, Oxford University Press, New Delhi, 2006, ISBN 978-0-19-563820-2, p.39n
  2. Nyāyavārttika, I-33