ఉపగ్రహ నిర్వీర్యం
ఉపగ్రహం జీవిత కాలాంతాన దానిలో ఉండే అంతర్గత శక్తిని తొలగించివేయడాన్ని ఉపగ్రహ నిర్వీర్యం అంటారు.[1] ఉపగ్రహ వాహక నౌకల లోని ఉచ్ఛ దశలను (upper stages) కూడా వాటి పని అయిపోయిన తరువాత నిర్వీర్యం చేస్తారు.
భూ సమవర్తన కక్ష్యలో ఉండే ఉపగ్రహాలు వాటి జీవిత కాలాంతాన తమను తామే శ్మశాన కక్ష్యలోకి నెట్టివేసుకునే విధంగాను, అక్కడ తమను తాము నిర్వీర్యం చేసుకునే విధంగాను రూపకల్పన చెయ్యాలని ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్, ఐక్యరాజ్యసమితి సూచిస్తున్నాయి. "ఈ సూచనను అమలు చెయ్యాలని [అంతర్జాతీయంగా] నిబంధన ఏమీ లేదు" కానీ, ఈ భూస్థిర ఉపగ్రహాలను చాలావరకు శ్మశానకక్ష్య లోకి పంపిస్తున్నారు.[1] మిగిలిపోయిన అంతర్గత శక్తిలో అధిక భాగం తోపుడు ఇంధనం.[1] బ్యాటరీలు కూడా ఈ శక్తిలో భాగమే. దాన్ని కూడా నిర్వీర్యం చెయ్యాల్సిన అవసరం ఉంది.[2]
ఈ అంతర్గత శక్తిని నిర్వీర్యం చెయ్యకపోతే అది పేలుడుకు, తద్వారా ఉపగ్రహం తునాతునకలైపోవడానికి, చివరకు అంతరిక్ష శిథిలాలుగా మారడానికీ కారణమౌతుంది.[1][2]
ప్రామాణిక పద్ధతులు
[మార్చు]ఉపగ్రహ, వాహక ప్రయోగ లైసెన్సులను నియంత్రించే వీలున్న దేశాల్లో నిర్వీర్యం చేసే నిబంధన పెట్టాల్సిన అవసరం ఉంది.
అమెరికా ప్రభుత్వం పౌర, సైనిక ఉపగ్రహాల నిర్వీర్యం విషయంలో కొన్ని ప్రామాణిక పద్ధతులను అమల్లో పెట్టింది. "ఉపగ్రహంలోగానీ, ఉచ్ఛ దశల్లోగానీ ఉండే అంతర్గత శక్తిని, ఇకపై దాని అవసరం లేదనుకుంటే, క్షీణింపజేయాలి. క్షీణింపజేసే సమయంలో పేలోడు భద్రతకు భంగం కలగదు అనే సమయం రాగానే ఈ క్షీణత జరగాలి. క్షీణింపజేసే క్రమంలో ఇంధనాన్ని మండించేటపుడు పేలుళ్ళకు, ఇతర ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలి."[3][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Johnson, Nicholas (2011-12-05). Livingston, David (ed.). "Broadcast 1666 (Special Edition) - Topic: Space debris issues" (podcast). The Space Show. 1:03:05-1:06:20. Retrieved 2015-01-05.
- ↑ 2.0 2.1 Bonnal, C. (2007). "Design and operational practices for the passivation of spacecraft and launchers at the end of life". Journal of Aerospace Engineering. Retrieved 2012-12-18.[permanent dead link]
- ↑ "U.S. Government Orbital Debris Mitigation Standard Practices" (PDF). United States Federal Government. Retrieved 2013-11-28.
- ↑ ""Orbital Debris – Important Reference Documents."". Archived from the original on 2016-07-02. Retrieved 2016-07-20.