Jump to content

ఉపాధ్యాయుల మురళీకృష్ణ

వికీపీడియా నుండి
ప్రొఫెసర్

ఉపాధ్యాయుల మురళీకృష్ణ
జననం
ఉపాధ్యాయుల మురళీకృష్ణ

(1933-12-25) 1933 డిసెంబరు 25 (వయసు 90)
విద్యఎం.ఎస్.సి., పి.హెచ్.డి.
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రసాయనశాస్త్ర పరిశోధకుడు
తల్లిదండ్రులుసత్యనారాయణ, అన్నపూర్ణ

ఉపాధ్యాయుల మురళీకృష్ణ రసాయన శాస్త్ర పరిశోధకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1933, డిసెంబరు 25కాకినాడలో సత్యనారాయణ, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు.[1] వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్.సి (ఆనర్స్) ను 1953 లో చేసారు. రసాయన శాస్త్ర పరిశోధనలు జరిపి ఎం.ఎస్.సి డిగ్రీని ఆ తరువాత పి.హెచ్.డిని పొందారు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం లో డిమానిస్ట్రేటరుగా చేరి అధ్యాపకునిగా, రీడరుగా, ప్రొఫెసరుగా వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన నూజివీడులో పి.జి.సెంటరుకు ప్రత్యేక అధికారిగా 1984 లో పనిచేసారు.

పరిశోధనలు

[మార్చు]

ఈయన మూలక, కర్బన, భౌతిక విశ్లేషణ మొదలగు ప్రధాన రసాయన శాస్త్ర విభాగాలన్నింటిమీద సాధికారికత సంపాదించారు. ఈయన ప్రధానంగా విశ్లేషణ రసాయన శాస్త్ర రంగంలో పరిశోధనలు చేసారు. క్రోమియం (vi), వెనేడియాలు అక్సీకరణులుగా కొన్ని సరిక్రొత్త ప్రయోగాలను నిర్వహించి పి.హెచ్.డి పట్టాను పొందారు. ఆయన తొలి పరిశోధన్ వ్యాసం పొటాషియం పర్మాంగనేటు, డైక్రోమేట్ అనే రెండు ప్రమాణ ఆక్సీకరణుల మిశ్రమమును నిర్ణయించిన అంశం మీద వెలువడింది. అక్జాలికామ్లాన్ని కారకంగా ఉపయోగించే ఈ పద్ధతి ఈ తరహా పద్ధతులలోనే ప్రథమం కావటం జరిగింది. ఇదే రకపు మిశ్రమాల నిర్ణయానికి థాలియాన్ని కారకంగా వాడే విధానమును కూడా ఈయన అభివృద్ధి పరచారు. ఈ తరహా నూతన విధానములను అనేకం ఆవిష్కరించారు, అభివృద్ధి చేసారు.

పరిశోధనా వ్యాసాలు

[మార్చు]

ఈయన దేశ, విదేశ విజ్ఞానశాస్త్ర పత్రికలలో అసంఖ్యాక వ్యాసాలు వ్రాసారు. ఉదాహరణకు ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ, జర్నల్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ లెటర్స్ (అమెరికా), మైక్రో కెమికల్ జర్నల్ (అమెరికా), స్పెక్ట్రోకెమికా ఆక్ట్రా (బ్రిటన్), జర్నల్ అనలటికా కిమి (ప.జర్మనీ), కెమికా ఆక్టాటుర్సిరకా (టర్కీ), టలంబా (బ్రిటన్), ఎనలిస్ట్ (బ్రిటన్) అనాలుసిన్ (ఫ్రాన్స్), కరెంట్ సైన్స్ (ఇండియా) మొదలగు రసాయన శాస్త్ర రంగంలో కొత్త రిడాక్స్ కారకములు:పద్ధతులు-సూచికలు: బలహీన కర్బన సంక్లిష్టాలు, వాని విశ్లేషణాత్మక ఉపయోగాలు, రసాయన గతి; సంవిధానములు; సముద్ర రసాయన ఉత్పత్తుల పునః సంపాదనలు మొదలగు అంశాలమిదనే కాక మరికొన్ని నానా విధ విషయాలను సాధించారు.

మూలాలు

[మార్చు]
  1. "Upadhyayula Muralikrishna". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-19.

ఇతర లింకులు

[మార్చు]