ఉబ్బలమడుగు జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉబ్బలమడుగు జలపాత దృశ్యం

ఉబ్బల మడుగు జలపాతం, ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. ఇది శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు.[1]

ఇది వర్షాకాల సమయంలో అనగా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతంలో నీరు పడుతుంటుంది. ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. పర్వతారోహణకు, విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము.

ఎలా వెళ్ళాలి

[మార్చు]

వరదయ్య పాలెం గ్రామం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహా శివరాత్రి సమయంలో ఆర్.టి.సి. వారు రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు. రాత్రులందు ఇక్కడ ఉండటం మంచిది కాదు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-18. Retrieved 2016-09-25.

వెలుపలి లంకెలు

[మార్చు]