ఉమాశశి
ఉమాశశి | |
---|---|
జననం | 1915 |
మరణం | 2000 డిసెంబరు 6 | (వయసు 84–85)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, గాయని, నర్తకి |
జీవిత భాగస్వామి | గురుప్రసాద్ దేవ్ |
పిల్లలు | గౌరంగ నారాయణ్, సౌమేంద్ర నారాయణ్, సౌరేంద్ర నారాయణ్, కనక్లత |
తల్లిదండ్రులు |
|
ఉమాశశి (1915 - 2000, డిసెంబరు) బెంగాలీ సినిమా నటి.[1] 1929 నుండి 1951 వరకు సినిమాలలో అనేక పాత్రలలో నటించింది. దుర్గాదాస్ బెనర్జీ, కుందన్ లాల్ సైగల్, పహారీ సన్యాల్, పృథ్వీరాజ్ కపూర్ వంటి నటులతో నటించి ప్రాచుర్యం పొందింది.
జననం, విద్య
[మార్చు]ఉమాశశి 1915లో[2] పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి నీల్మణి చటోపాధ్యాయ, తల్లి రాధారాణి చటోపాధ్యాయ. తండ్రి నీల్మణి ఛటోపాధ్యాయ బ్రిటిష్ ఇండియా, తూర్పు బెంగాల్‌లోని ఢాకా నుండి వచ్చి కలకత్తాలో స్థిరపడ్డాడు. నీల్మణి ఛటోపాధ్యాయ కీర్తనలు పాడే కళాకారుడిగా జాత్రా బృందంలో పనిచేశాడు. ఉమాశశి పేదరికం కారణంగా స్థానిక పాఠశాలలోనే చదువుకుంది.[3]
నాట్యరంగం
[మార్చు]నాలుగేళ్ళ వయసు నుంచే సత్కారీ గంగూలీ నృత్యం, సంగీతంలో శిక్షణ పొందింది. సత్కారి గంగూలీ ఒక నటికావడంతో తనతోపాటు ఉమాశశి కూడా నటిగా వెళ్ళింది. ఉమాశశి మినర్వా, ఆల్ఫ్రెడ్, రుస్సా వంటి నాటక బృందాలలో డ్యాన్సర్‌గా పనిచేసింది. నాటకరంగంలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. కోల్‌కతా నుండి చిట్టగాంగ్, కాక్స్ బజార్ మొదలైన వివిధ ప్రాంతాలలో తన జాత్రా బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. బంగాబాలా అనే ఒక మూకీ సినిమాతో సినిమారంగంలోకి అరంగేట్రం చేసింది. సినిమాలో నటిస్తూ నాటకరంగంలో ఉండకూదడని నాటకసంస్థల నిర్వాహకులు నియమాలు పెట్టడంతో నాటకరంగం నుండి నిష్క్రమించింది.
సినిమారంగం
[మార్చు]బంగాబాల అనే మూకీ సినిమాలో సుబర్ణ అనే చిన్న పాత్రతో సినిమాల్లో నటించడం ప్రారంభించింది. బిగ్రహ (1930), అభిషేక్ (1931) వంటి మూకీ సినిమాలలో నటించింది. సంగీత దర్శకుడు పంకజ్ కుమార్ మల్లిక్ ద్వారా గానంలో శిక్షణ పొందింది.[4] 1932లో న్యూ థియేటర్స్ తీసిన చండీదాస్ సినిమాలో తొలిసారిగా ప్రధాన (రామి) పాత్రలో నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]న్యాయవాది శ్రీ గురుప్రసాద్ దేవ్‌తో ఉమాశశి వివాహం జరిగింది. గురుప్రసాద్ కు అప్పటికే వివాహమైంది.
మరణం
[మార్చు]ఉమాశశి 2000 డిసెంబరు 6న మరణించింది.
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉమాశశి ముఖ్య అతిథిగా హాజరయింది. 2000లో లివింగ్ లెజెండ్‌గా హీరో హోండా అవార్డును కూడా అందుకుంది.
సినిమాలు (కొన్ని)
[మార్చు]- 1931: అభిషేక్
- 1932: చండీదాస్
- 1932: భాగ్యలక్ష్మి
- 1932: బిష్ణుమాయ (1932)
- 1933: పురాణ్ భగత్
- 1933: కపాల్కుండల
- 1934: చండీదాస్
- 1934: మొహబ్బత్ కి కసౌతి (హిందీ)
- 1934: రూప్ లేఖ (బెంగాలీ)
- 1934: డాకు మన్సూర్
- 1935: ధూప్ చావోన్
- 1935: భాగ్యచక్ర
- 1937: అనాత్ ఆశ్రమం
- 1937: లెహరి లుటేరా
- 1938: ధర్తిమాత (హిందీ)
- 1938: దేశేర్ మతి (బెంగాలీ)
- 1947: లీల (కథ రచయిత, స్క్రీన్ రైటర్)
- 1949: జై భీమ్ (ఉమా)
- 1951: దీదార్
మూలాలు
[మార్చు]- ↑ "Umasashi". www2.bfi.org.uk.
- ↑ "Umasashi Discussion". moviechat.org.
- ↑ "Umasashi". myheritage.com.
- ↑ "Messages in black and white". thehindu.com.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఉమాశశి పేజీ