ఉమేష్ కులకర్ణి (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉమేష్ కులకర్ణి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉమేష్ నారాయణ్ కులకర్ణి
పుట్టిన తేదీ(1942-03-07)1942 మార్చి 7
అలీబాగ్, బ్రిటిషు భారతదేశం
ఎత్తు5 ft 6.5[1] in (1.69 m)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 117)1967 డిసెంబరు 23 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1968 ఫిబ్రవరి 22 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 4 29
చేసిన పరుగులు 13 158
బ్యాటింగు సగటు 4.33 7.90
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 7 26*
వేసిన బంతులు 448 2,969
వికెట్లు 5 40
బౌలింగు సగటు 47.60 39.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/37 4/43
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/–
మూలం: Cricinfo, 2022 సెప్టెంబరు 10

ఉమేష్ నారాయణ్ కులకర్ణి (జననం 1942 మార్చి 7) 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో భారతదేశం తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటరు.

లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్, కులకర్ణి 1963-64 నుండి 1969-70 వరకు బొంబాయి తరపున దేశీయ క్రికెట్ ఆడాడు. 1964-65లో సిలోన్‌పై భారతదేశం తరఫున తీసిన 43 / 4 అతని అత్యుత్తమ గణాంకాలు. [2] భారతదేశంలో 1966-67 సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ అతను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. [3] ఆ పర్యటనలో అతను విజయవంతం కాలేదు. ఎనిమిది టెస్టులకు గాని నాలుగింటిలో ఆడి, ఐదు వికెట్లు తీసుకున్నాడు. పర్యటన తర్వాత, గాయాలతో అతని క్రీడా జీవితం ముగిసింది. తర్వాత అతను టాటా గ్రూప్‌లో పనిచేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్[మార్చు]

ఉమేష్ కులకర్ణి ఫస్ట్-క్లాస్ కెరీర్ 1963-64 సీజన్ నుండి 1969-70 సీజన్ వరకు కొనసాగింది.

ఎడమచేతి ఫాస్ట్ బౌలరుగా దేశీయ క్రికెట్‌లో ఆడాడు. అతను 1963-64 సీజన్ నుండి 1969-70 సీజన్ వరకు ముంబై జట్టు తరఫున చాలా ఆటలు ఆడాడు.

1964-65 సీజన్‌లో జట్టుతో కలిసి సిలోన్‌ వెళ్ళాడు. ఈ పర్యటనలో అతను, 4/43 తో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలను సాధించాడు. 1966-67 సీజన్‌లో, అతను నాలుగు ఆటలలో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించే భారత జట్టులో సభ్యునిగా తీసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

ఉమేష్ కులకర్ణి తన కెరీర్ మొత్తంలో కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే ఆడాడు. అతను 1967 డిసెంబరు 23 న అడిలైడ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో, టెస్టుల్లో ప్రవేశించాడు. 1968 ఫిబ్రవరి 22 న క్రైస్ట్‌చర్చ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడాడు.

అతను 1967-68 సీజన్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించే భారత జట్టులో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు, న్యూజిలాండ్‌తో ఒక టెస్టు ఆడే అవకాశం లభించింది. అయితే, పిచ్ నుండి కొంత సహాయం లభించినప్పటికీ, అతను పెద్దగా రాణించలేదు.

అడిలైడ్‌లో జరిగిన సిరీస్‌లోని తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బిల్ లారీని ఔట్ చేశాడు. ఇది అతని ఏకైక విజయం. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ దశలో సుమారు అరగంట పాటు ఎం.ఎల్. జయసింహతో పాటు క్రీజులో నిలబడ్డాడు. జయసింహ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను మైదానంలోకి ప్రవేశించి అతని సెంచరీ పూర్తి చేయడానికి తోడుగా నిలబడ్డాడు.[4]

అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆట ముగిసాక, అతను కొన్ని సంవత్సరాలు బాంబే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన స్వల్పకాలిక ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 39.95 సగటుతో 40 వికెట్లు తీశాడు.

మూలాలు[మార్చు]

  1. Mukherjee, Abhishek. "Umesh Kulkarni: Unexpected selection before disappearance for good". Cricket Country. Retrieved 7 March 2018.
  2. India v Ceylon 1964-65
  3. Umesh Kulkarni bowling by season
  4. "Umesh Kulkarni Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.