ఉల్బక ద్రవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉల్బక ద్రవం (Amniotic fluid) ఉల్బ కుహరం (Amniotic cavity) లో ఉండే ద్రవం. ఇది గర్భాశయంలోని పిండం చుట్టూ ఉండి రక్షణ కల్పిస్తుంది. సామాన్య పదజాలంలో దీనిని ఉమ్మనీరు అంటారు. దీని చుట్టూ ఉల్బం (Amniotic membrane) కప్పివుంటుంది.

ఉల్బక ద్రవం లోని 10 వారాల శిశువు

ఉల్బక ద్రవాన్ని గర్భంలోని శిశివు లోనికి పీలుస్తూ తిరిగి బయటకు విడిచేస్తుంటాడు. అంతేకాకుండా తాగడం వలన పేగుల్లోనికి చేరి శోషణ ద్వారా ముత్రంగా మారి తిరిగి ఉల్బాన్ని చేరుతుంది. ఇది ఒక కుషన్ లాగా పనిచేసి తల్లి కడుపు మీద కలిగే ఒత్తిడి నుండి రక్షిస్తుంది. గర్భాశయంలో శిశువు సుళువుగా తిరిగడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అధికంగా వేడిమి కోల్పోకుండా కాపాడుతుంది.

ఉల్బక ద్రవం యొక్క పరిమాణం పిండం పెరుగుతున్నకొద్దీ పెరుగుతుంది. ఇది 34 వారాల గర్భావధి కాలంలో అత్యధికంగా అనగా సుమారు 800 మి.లీ. ఉంటుంది. తర్వాత కొంత తగ్గి కానుపు సమయానికి 600 మి.లీ. ఉంటుంది.

కానుపు సమయంలో గర్భాశయం యొక్క సంకోచాల వలన కలిగే ఒత్తిడి మూలంగా ఉల్బపు పొర చిరిగి (Spontaneous Rupture of Membranes) ఉమ్మనీరు పోతుంది. కొన్నిసార్లు వైద్యులు పిండం పరిస్థితి సరిగా లేనప్పుడు ఈ పొరను ముందుగానే కత్తిరించి (Artificial Rupture of Membranes) ఉమ్మనీటిని పోయేటట్లుగా చేస్తారు. ఇందువలన కానుపు త్వరగా అవడానికి వీలుంటుంది.

వ్యాధి నిర్ధారణ[మార్చు]

ఈ ఉల్బక ద్రవాన్ని బయటికి తీసి కొన్ని పరీక్షలు జరపడం వలన పిండం యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుస్తాయి. జన్యు సంబంధమైన లోపాలను కూడా దీనిలోని కణాలను పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చును.