ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్
ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ : ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ ఉత్తర ప్రదేశ్, ఆగ్రా సమీపంలోని సికందరలో 1886 లో జన్మించాడు.
జీవిత చరిత్ర
[మార్చు]ఫయ్యాజ్ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ రంగీలా ఘరానాకు చెందిన వాడు. ఆగ్రా ఘరానాకు చెందిన తన తాత, ఘగ్ఘే ఖుదాబక్ష్ నుండి, ఫయ్యాజ్ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ప్రాంతంలో గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఫయ్యాజ్ ఖాన్ వల్లనే, ఆగ్రా ఘరానా గాయన శైలి పరిపూర్ణతను సంతరించుకొన్నది. అతడు ఠుమ్రి, దాద్రా, గజల్ లను అద్భుతంగా పాడి శ్రోతలను ఆకట్టుకొనేవాడు. చాలాకాలం బరోడాలో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.అక్కడే అతనికి జ్ఞానరత్న పురస్కారం ఇవ్వబడింది. మైసూర్ మహారాజా అతడికి 'ఆఫ్తాబే మౌసికి' (ఆఫ్తాబ్=సూర్యుడు, మౌసికి=సంగీతం) = 'సంగీత మార్తాండుడు' అని బిరుదు నిచ్చి, సన్మానించాడు. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్‌కు బ్రజ భాష పై మంచి పట్టు ఉండేది. అతని వ్యాసాలు ప్రేమ్ పియా అనే కలం పేరుతో అచ్చౌతుండేవి.
ద్రుపద్ దమ్మార్ శైలీ అని ప్రాచీన కాలంలో ఒక సంగీత బాణీ ఉండేది. ఈ రోజుల్లో అది అంతగా ప్రసిద్ధి చెందలేదు కాని, ఫయ్యాజ్ ఖాన్ పూర్వులు ఈ బాణీ సంగీతం పాడడంలో బాగా సమర్ధులు. నిజానికి ఈ కుటుంబంవారు హిందుస్తానీ సంగీతంలో బాగా ప్రసిద్ధి కెక్కిన అనేక కృతులు రచించారనే చెప్పాలి. ఫయ్యాజ్ ఖాన్ తాత, ఘగ్ఘే ఖుదాబక్ష్ నుండి వ్రజ భాషకు సంబంధిచిన పాండిత్యం బాగా సంపాదించారు. కవిత అవగాహనే చేసుకొనే శక్తి ఆయన్ గానానికి కొత్త అందం తీసుకు వచ్చింది.
ఫయ్యాజ్ ఖాన్ 10 సం.లు వచ్చేసరికి ఈయన సంగీత విద్వాంసులు కూడా అసూయపడేటంత సంగీత విజ్ఞానం సంపాదించారు. చిన్నతనంలోనే తాతగారీయనను పలు నగరాలకు తీసుకువెళ్ళి సభల్లో పాడించేవారు. 1906లో మైసూరు సంస్థాన గాన విద్వాంసుడు పఠాన్ ఖాన్ గులాం అబ్బాస్ ఖాన్ను దసరా ఉత్సవాలకు పిలిపించగా వారి బృదంలో ఫయ్యాజ్ ఖాన్ కూడా ఉన్నారు. అప్పుడీయన వయస్సు 20 సం.ఈయన గానానికి మెచ్చి మైసూరు మాహారాజా వీరికి బంగారు పతకం బహూకరించారు.ఆ తరువాత కొన్నేళ్ళకు బరోడా మహారాజా సమక్షంలో పాడే అవకాశం కలిగింది. బరోడా మాహారాజా ఈయనను వెంటనే ఆస్థాన విద్వాంసులుగా ఏర్పాటుచేసారు. అప్పటి నుంచి అంటే 1912నుండి మరణాంతము ఫయ్యాజ్ ఖాన్ బరోడాలోనే ఉండి అనేక విధాలుగా ఆ సంస్థానం గౌరవం ఇనుమడింప జేసారు. బరోడాలో ఉన్న కొంతకాలానికి ఈయనకు బరోడా ఖాన్ సాహెబ్ అనే విఖ్యాతి కలిగింది.1920లో ఇండోర్ మహారాజా తుకోజీ రావు హోళీ పండుగ ఉత్సవాల్లో వీరిగానం విని, ఆనందించి వీరికి 15 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చి గౌరవించారు. 1930 సం. తరువాత బెంగాల్, ముంబాయి, బీహార్, యు.పి మొదలైన నగారాలలో అనేక సంగీత పరిషత్తులు జరిగాయి. ఈ పరిషత్తులన్నింటిలోనీ ఫయ్యాజ్ ఖాన్ అత్యంత ప్రధాన మయిన స్థానం ఆక్రమించారు. అప్పట్లో రేడియో వలన కూడా వీరి ఖ్యాతి తారా స్థాయికి చేరుకుంది.
భారతదేశంలో పూర్వం ద్రుపద్ దుమ్మార్ బాణీ ద్వారానే సంగీతం నేర్పేవారు. ఫయ్యాజ్ ఖాన్ కూడా ఈబాణీలోనే సంగీతం అభ్యసించారు. కాని ముఖ్యంగా ఈయనకు ఖ్యాల్ గాయకులనే విఖ్యాతి వచ్చింది. ద్రుపద్దుమార్ శైలిలో విఖ్యాతులయినా ఈయన 1935 దాకా ఈబాణీలో పాడడం జరగలేదు. గానసభలలో ఎవరైనా కావాలని పట్టుపట్టినప్పుడు మాత్రమే ఈయన ఈ శైలిలో పాడేవారు.అయితే ఈశైలిలో చాలా జనరంజికంగా పాడడం వల్ల అనేకులు వీరి శైలిలో పాడవలసిందిగా కోరేవారు.క్రమంగా వీరికీశైలిలో ప్రవీణులనే కీర్తి వచ్చింది. ఫయ్యాజ్ ఖాన్ జ్ఞాపక శక్తి కలవారు.వీరు పాటలను జ్ఞాపక శక్తి ద్వారానే అధ్యసించేవారు.
రామకలీ, జయజయంతి, మేఘమల్హార్, తోడి, సింధూర్, చాయానాట రాగాలలో ఫయ్యాజ్ ఖాన్ ప్రత్యేకంగా కృషిచేసారు. ద్రుపదధమార్ శైలిలో పాడడము, టుమ్రిలు మొదలైనవి ఆలాపించడము, హర్షించని రోజులలో ఫయ్యాజ్ ఖాన్ ఈఅభిప్రాయాలను ప్రతిఘటించి, వీటికి వీటికి బాగా ప్రచారం చేసారు. కనుకనే ఈ బాణీలకు ఈనాడింత గౌరవం కలిగింది.
1948లో ఫయ్యాజ్ ఖాన్ బాగా జబ్బు చేసింది. అందుచేత రెండుమూడు నెలలదాకా ఈయన గాన సభలలో పాల్గొనలేదు. ఆరోగ్యం అంతగా బాగుండకపోయినా ఈయన 1949లో కలకత్తాలో జరిగిన సంగీతపరిషత్తుకు హాజరైనారు. అక్కడ వీరికి 10వేల రుపాయల బహుమతి ఇచ్చి అఖండ సన్మానం జరిపారు.
ఫయ్యాజ్ ఖాంకు సంతానం కలుగలేదు.
శిష్యులు
[మార్చు]దిలిప్ చాన్ బేడి మరియ్ రతజన్‌కర్ లు.
విడుదలైన రికార్డులు
[మార్చు]1. రామ్‌కలి (రాగం) నెం. N 3 6 0 5 0 2. పూర్వి , ఛాయా H 1 3 3 1 3. పురియా, జయజయవంతి HH1 4. జౌన్‌పురి, కాఫి H 7 9 3
బయటి లింకులు
[మార్చు][1] ఫయాజ్ ఖాన్ పాడిన రాగాలు-తోడి, దర్బార్