Jump to content

ఉస్మాన్ షిన్వారి

వికీపీడియా నుండి
ఉస్మాన్ షిన్వారీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉస్మాన్ ఖాన్ షిన్వారీ
పుట్టిన తేదీ (1994-01-05) 1994 జనవరి 5 (వయసు 30)
ఖైబర్ ఏజెన్సీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 240)2019 డిసెంబరు 11 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 216)2017 అక్టోబరు 20 - శ్రీలంక తో
చివరి వన్‌డే2019 అక్టోబరు 2 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 58)2013 డిసెంబరు 11 - శ్రీలంక తో
చివరి T20I2019 అక్టోబరు 9 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–2019; 2022కరాచీ కింగ్స్ (స్క్వాడ్ నం. 14)
2017సిల్హెట్ స్ట్రైకర్స్
2018మెల్‌బోర్న్ రెనిగేడ్స్
2019–presentఖైబర్ పఖ్తూన్వా
2020లాహోర్ కలందర్స్ (స్క్వాడ్ నం. 14)
2020Jaffna Stallions
2021క్వెట్టా గ్లాడియేటర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20
మ్యాచ్‌లు 1 17 16
చేసిన పరుగులు 6 2
బ్యాటింగు సగటు 2.00
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 6 2*
వేసిన బంతులు 90 720 282
వికెట్లు 1 34 13
బౌలింగు సగటు 54.00 18.65 32.60
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/54 5/34 3/31
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 1/–
మూలం: Cricinfo, 5 March 2021

ఉస్మాన్ ఖాన్ షిన్వారీ (జననం 1994, జనవరి 5) పాకిస్తానీ క్రికెటర్. ఇతను కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1] పాకిస్తాన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ సర్క్యూట్‌లో జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ టీమ్ తరపున ఆడుతున్నాడు. గతంలో ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.[2] 2013 డిసెంబరులో, జాతీయ టీ20 ఫైనల్‌లో నాలుగు ఓవర్లలో 9 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత యుఏఈలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో అతను జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[3][4]

2018 ఆగస్టులో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో షిన్వారీ ఒకరు.[5][6] 2021 నవంబరులో, ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[7]

ప్రారంభ జీవితం, వృత్తి

[మార్చు]

ఉస్మాన్ షిన్వారీ పష్టూన్‌ల ఘనిఖేల్ షిన్వారీ తెగకు చెందినవాడు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్‌లోని ఖైబర్ జిల్లాలోని లాండి కోటల్ అనే పట్టణంలో పెరిగాడు. లాండి కోటల్‌లోని టాటారా గ్రౌండ్ నుండి క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు.[8] ఇతని తండ్రి, అస్మత్ ఉల్లా ఖాన్ కూడా ఒక క్రికెటర్, దేశీయ మ్యాచ్‌లు ఆడేవారు.

దేశీయ, ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

దేశీయ క్రికెట్ ఆడతున్నాడు. 2013 డిసెంబరు 3న, 9 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఆరు మ్యాచ్ లలో 11 వికెట్లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.[9]

2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[10][11]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

దేశీయ ప్రదర్శన ఆధారంగా, యుఏఈలో 2013, డిసెంబరు 11న ప్రారంభమైన శ్రీలంకతో జరిగిన 2013–14 టీ20 సిరీస్‌కు PCB ఎంపిక కమిటీ ఉస్మాన్‌ని ఎంపిక చేసింది.[3]

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 పరుగులకు వెళ్లిన తర్వాత ఇతనికి ఒక ఓవర్ మాత్రమే ఇవ్వబడింది. తదుపరి టీ20లో ఇతనికి 4 ఓవర్ల పూర్తి కోటా ఇవ్వబడింది. 52 పరుగులకు వెళ్లింది. ఇతను 3 బంతుల్లో 2 * కూడా చేశాడు.

2017 మార్చిలో, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[12] 2017 అక్టోబరులో, శ్రీలంకతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో చేర్చబడ్డాడు.[13] 2017 అక్టోబరు 20న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[14] తన కెరీర్‌లో రెండో మ్యాచ్‌లో, కేవలం 21 బంతుల్లో తన తొలి ఐదు వికెట్ల పంటను పూర్తిచేశాడు.[15] ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 5-0తో శ్రీలంకను ఓడించింది. ఇతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.[16]

2019 డిసెంబరులో, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.[17] 2019 డిసెంబరు 11న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[18]

2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం అతను 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[19][20] జులైలో, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ 20 మంది సభ్యుల జట్టులో ఇతను షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు.[21][22]

మూలాలు

[మార్చు]
  1. "Pakistan have an 'excellent balance' to their white-ball sides – Shinwari". International Cricket Council. Retrieved 16 January 2019.
  2. "Usman Khan". Cricinfo. Retrieved 11 December 2013.
  3. 3.0 3.1 "Pakistan reward rookie bowler with T20 spot". Dawn. 10 December 2013. Retrieved 11 December 2013. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Dawn" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Throwback to the 90s but questions remain". Dawn. 11 December 2013. Retrieved 11 December 2013.
  5. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  6. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
  7. "Usman Shinwari announces retirement from red-ball cricket". ESPN Cricinfo. Retrieved 16 November 2021.
  8. "Whole Landi Kotal is in celebration, says Shinwari's father on son's brilliant spell". The Express Tribune. Retrieved 20 October 2018.
  9. "Usman, Haris stars in convincing ZTBL win". ESPN cricinfo. Retrieved 4 December 2013.
  10. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  11. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  12. "Kamran Akmal returns to Pakistan ODI and T20I squads". ESPN Cricinfo. Retrieved 15 March 2017.
  13. "Shin injury puts Amir out of ODI series". International Cricket Council. Retrieved 8 October 2017.
  14. "4th ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Sharjah, Oct 20 2017". ESPN Cricinfo. Retrieved 20 October 2017.
  15. "Khan's record haul destroys SL". Cricket Australia. Retrieved 23 October 2017.
  16. "5th ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Sharjah". Espn cricinfo. Retrieved 23 October 2017.
  17. "Fawad Alam returns to Pakistan's Test squad for Sri Lanka series". ESPN Cricinfo. Retrieved 7 December 2019.
  18. "1st Test, ICC World Test Championship at Rawalpindi, Dec 11-15 2019". ESPN Cricinfo. Retrieved 11 December 2019.
  19. "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 12 June 2020.
  20. "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 12 June 2020.
  21. "Pakistan shortlist players for England Tests". Pakistan Cricket Board. Retrieved 27 July 2020.
  22. "Wahab Riaz, Sarfaraz Ahmed in 20-man Pakistan squad for England Tests". ESPN Cricinfo. Retrieved 27 July 2020.