ఊడిజర్ల
స్వరూపం
ఊడిజెర్ల, పల్నాడు జిల్లా, ఈపూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 ఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొలికి అంజమ్మ, 76 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైంది.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన యర్రం కోటిరెడ్డి వయస్సు 75 సంవత్సరాలు. వృత్తి వ్యవసాయం. ఇతనికి ఈత అంటే మక్కువ. చిన్నతనంలోనే, రొంపిచర్ల మండలం లోని బుచ్చిపాపన్నపల్లె గ్రామంలో పమ్మి ముసలారెడ్డి అను గురువు వద్ద ఈ విద్య నేర్చుకున్నాడు. ఇప్పటికీ ఖాళీ దొరికినప్పుడలా ప్రక్కనే ఉన్న సాగరు కాలువలో ఈతకు వెళుతుంటాడు.ఇతను అందరిలాగా కాకుండా వైవిధ్యంగా ఈదుతాడు.ఆ వయస్సులో అతను వంతెనపై నుండి కాలువలోకి పల్టీలు కొట్టేవాడు. వెల్లకిలా నీళ్ళపై పడుకుని కాళ్ళు, చేతులా ఆడించకుండా ఈదుతూ నీళ్ళపై ఎంతసేపైనా ఉండేవాడు. అనుకోకుండా అలా వెళుతున్న ఇతనిని చూసి కాలువులో శవం వెళుతుందని అనుకోవడం పరిపాటి.