ఎం.ఎస్. గురుపాదస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఎస్. గురుపాదస్వామి
జననం7 ఆగస్టు 1924
మాలంగి, మైసూర్ రాజ్యం, (ప్రస్తుత మైసూర్ జిల్లా, కర్ణాటక, భారతదేశం)
మరణం2011 మే 10(2011-05-10) (వయసు 86)
విద్యాసంస్థమహారాజా కళాశాల, మైసూరు
క్యానింగ్ కాలేజ్, లక్నో
రాజకీయ పార్టీజనతా దళ్
జీవిత భాగస్వామిరాజశ్రీ

ఎం.ఎస్. గురుపాదస్వామి ( 1924 ఆగస్టు 7 – 2011 మే 10) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 1989 డిసెంబరు నుండి 1990 నవంబరు వరకు రాజ్యసభ నాయకుడిగా ఉన్న ఆయన 1971 మార్చి నుండి 1972 ఏప్రిల్, 1991 జూన్ 28 నుండి 1991 జూలై 21 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా రెండుసార్లు పనిచేశారు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గురుపాదస్వామి 1924 ఆగస్టులో మైసూరు జిల్లాలోని మలాంగిలో జన్మించాడు. నలుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులలో అతను రెండవవాడు.[2]

మలంగిలో ప్రాథమిక విద్య, మాలవల్లిలో మాధ్యమిక విద్యను పూర్తి చేసుకున్నాడు. అతను మైసూరు లోని మహారాజా కళాశాలలో బి.ఎ., లక్నోలోని కానింగ్ కళాశాలలో ఎల్.ఎల్.బి, ఎం.ఎ. చదివాడు.[2]

1945 మే 21న రాజశ్రీని వివాహం చేసుకున్నాడు.[3] ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

గురుపాదస్వామి స్వాతంత్ర్య ఉద్యమకారుడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో అఖిల భారత విద్యార్థుల సమాఖ్యలో సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశ స్వాతంత్ర్యం తరువాత అతను కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో చేరాడు. 1952 సార్వత్రిక ఎన్నికలలో మైసూరు నుండి లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1952లో జాతీయ స్థాయిలో తన పార్టీ, సోషలిస్టు పార్టీ విలీనం తర్వాత గురుపాదస్వామి పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు.[1]

గురుపాదస్వామి మైసూరు నుండి 1960 నుండి 1966 వరకు, ఉత్తర ప్రదేశ్ నుండి 1966 నుండి 1972 వరకు, 1984 నుండి 1990 వరకు, 1990 నుండి 1992 వరకు కర్ణాటక నుండి 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.[1]

1969లో కాంగ్రెస్ విడిపోయినప్పుడు ఇందిరా గాంధీ మంత్రి వర్గానికి రాజీనామా చేసిన మొదటి మంత్రులలో గురుపాదస్వామి ఒకరు. గురుపాదస్వామి 1971లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మారారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు.

గురుపాదస్వామి 1989 నుండి 1990 వరకు వి.పి.సింగ్ మంత్రిత్వ శాఖలో పెట్రోలియం, రసాయనాల మంత్రిగా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The Hindu : Karnataka News : M.S. Gurupadaswamy passes away". web.archive.org. 2011-05-14. Archived from the original on 2011-05-14. Retrieved 2021-10-04.
  2. 2.0 2.1 "Celebrity Photo Gallery, Celebrity Wallpapers, Celebrity Videos, Bio, News, Songs, Movies". web.archive.org. 2015-03-28. Archived from the original on 2015-03-28. Retrieved 2021-10-04.
  3. "Members Bioprofile". 164.100.47.194. Retrieved 2021-10-04.

బాహ్య లింకులు

[మార్చు]