ఎం.పి. శివజ్ఞానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైలై పొన్నుస్వామి శివజ్ఞానం
2006లో ఇండియన్ పోస్టల్ స్టాంపుపై శివజ్ఞానం
జననం
శివజ్ఞానం గ్రామణి

(1906-06-26)1906 జూన్ 26
సాలవన్‌కుప్పం, చెన్నై
మరణం1995 అక్టోబరు 3(1995-10-03) (వయసు 89)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఎం.పి. శివజ్ఞానం, మా.పో.సి.
వృత్తిజర్నలిస్ట్, కవి

ఎం.పి. శివజ్ఞానం (26 జూన్ 1906 - 3 అక్టోబర్ 1995) - అతని పూర్తి పేరు మైలై పొన్నుస్వామి శివజ్ఞానం.[1] ప్రముఖంగా మా.పో.సి. అని కూడా పేరు. ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. రాజకీయవేత్తగా తమిళ అరసు కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అతను 100 కంటే ఎక్కువ పుస్తకాలు రచించాడు.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

1906 జూన్ 26న మద్రాసు నగరం(ప్రస్తుతం చెన్నైగా మార్చబడింది)లోని థౌజండ్ లైట్స్‌లోని సాల్వన్‌కుప్పంలో ఎం.పి. శివజ్ఞానం జన్మించాడు. ఆయన తల్లిదండ్రులైన పొన్నుస్వామి, శివగామిలకు దైవభక్తి ఎక్కువ. పేదరికం కారణంగా అతని చదువు ౩వ తరగతితో నిలిచిపోయింది. తోబుట్టువుల్లో పెద్దవాడైన ఎం.పి. శివజ్ఞానం కొంతకాలం దినసరి కూలీగా మారాడు. ఆ తరువాత ఎనిమిదేళ్లపాటు నేత కార్మికుడిగా పనిచేశాడు. తదుపరి ప్రెస్ ఆఫ్ తమిళ్ జర్నల్‌లో కంపోజిటర్‌గా ఎం.పి. శివజ్ఞానం జీవితాన్ని ప్రారంభించాడు.

1967లో ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థిగా త్యాగరాయనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి అతను తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] తమిళనాడు విభజనలో ఆయన పాల్గొనడం రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపువచ్చింది. అతని ప్రయత్నాల ద్వారా రాష్ట్రం మద్రాసును నిలుపుకుంది. అతని 'ది నామాడే వర్సెస్ మనడే' ఆందోళన కారణంగా ఆంధ్రప్రదేశ్ నుండి తిరుత్తణిని కలుపోగలిగింది. 1986లో ఎం. జి. రామచంద్రన్‌చే తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయబడినప్పుడు అతను ఛైర్మన్ (ప్రిసైడింగ్ అధికారి)గా వ్యవహరించారు.[2]

చెన్నైలో శివజ్ఞానం విగ్రహం

అవార్డులు, సన్మానాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Padma Awards 1972 Archived 2018-11-13 at the Wayback Machine. padmaawards.gov.in
  2. 2.0 2.1 Government to take over Ma.Po.Si.'s works The Hindu, 2 July 2006. Accessed 21 July 2008
  3. List Of Political Parties. (PDF) . Retrieved on 2018-11-13.