ఎం.వి.సుబ్బయ్యనాయుడు
ఎం.వి.సుబ్బయ్య నాయుడు | |
---|---|
జననం | మైసూర్ వెంకటప్ప సుబ్బయ్య నాయుడు 1896[1] మాదపుర, హెగ్గదదేవన కోటె, మైసూరు సామ్రాజ్యం |
మరణం | 1962 జూలై 21 మాండ్య, మైసూర్ రాష్ట్రం, భారతదేశం | (వయసు 65–66)
వృత్తి | నటుడు, దర్శకుడు |
జీవిత భాగస్వామి | మునివెంకటమ్మ |
పిల్లలు | నలుగురు, లోకేష్ తో సహా |
మైసూరు వెంకటప్ప సుబ్బయ్య నాయుడు (1896 – 21 జూలై 1962) ఒక భారతీయ రంగస్థల, మూకీ చిత్రాల నటుడు, దర్శకుడు. ఇతడు తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచన (1934), తెలుగు సినిమా భూకైలాస్ (1940), కన్నడ సినిమా భక్త ప్రహ్లాద (1958) మొదలైన వాటిలో నటించి పేరు గడించాడు.[1] ఇతడు కన్నడ సినిమా హీరో లోకేశ్ తండ్రి. [2] నాటక రంగంలో ఇతని కృషికి గుర్తింపుగా 1961లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. [3]
విశేషాలు
[మార్చు]సుబ్బయ్య నాయుడు నాటకాలలో మొదట చిన్న చిన్న పాత్రలలో నటించడం ప్రారంభించి నాయక పాత్రలు ధరించడం వరకు ఎదిగాడు. ఇతడు ఆ రోజులలోనే చెప్పుకోదగ్గ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇతడు రట్టిహళ్లి నాగేంద్రరావుతో కలిసి సినిమాలలో నటించడం ఆరంభించాడు. వీరిద్దరూ కలిసి తొలినాళ్ళ కన్నడ సినిమాలు వసంతసేన (1941), సత్య హరిశ్చంద్ర (1943), మహాత్మా కబీర్ (1947) వంటివి తీశారు. భక్త ప్రహ్లాద సినిమా తర్వాత ఇతడు మళ్ళీ నాటకరంగానికే పరిమితమయ్యాడు.[4]
మరణం
[మార్చు]ఇతడు 1962, జూలై 21న మాండ్యలో గుండెపోటుతో మరణించాడు. ఇతని చివరి రోజులలో కూడా ఇతడు తన నాటక సమాజం సాహిత్య సామ్రాజ్య నాటక మండలితో కలిసి చురుకుగా నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు మరణించే రోజు మండ్యలో ఓ నాటకంలో అంబరీషుని వేషం వేశాడు.[4]
పాక్షిక ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1934 | సతీ సులోచన | ఇంద్రజిత్తు |
1940 | భూకైలాస్ | రావణుడు |
1941 | వసంతసేన | |
1943 | సత్య హరిశ్చంద్ర | హరిశ్చంద్రుడు |
1947 | మహాత్మా కబీర్ | |
1958 | భక్త ప్రహ్లాద |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "M.V. Subbaiah Naidu". IMDB. IMDB. Retrieved 21 March 2014.
- ↑ "Actor Lokesh is dead". The Hindu. 15 October 2014. Archived from the original on 27 మార్చి 2005. Retrieved 21 March 2014.
- ↑ "Sangeet Natak Akademi Awardee". Sangeet Natak Akademi. sangeetnatak.gov.in. Archived from the original on 16 మార్చి 2018. Retrieved 21 April 2017.
- ↑ 4.0 4.1 "Subbaiah Naidu Passes Away". The Indian Express. 22 July 1962. p. 5. Retrieved 11 April 2017.