మునిస్వామి తంబిదురై

వికీపీడియా నుండి
(ఎం. తంబిదురై నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఎం. తంబిదురై
మునిస్వామి తంబిదురై


రాజ్యసభ సభ్యుడు ]]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 మార్చ్ 2020
నియోజకవర్గం తమిళనాడు

పదవీ కాలం
13 ఆగష్టు 2014 – 25 మే 2019
ముందు కరియా ముండ
తరువాత ఖాళీ
పదవీ కాలం
22 జనవరి 1985 – 27 నవంబర్ 1989
ముందు జి. లక్ష్మణన్
తరువాత శివరాజ్ పాటిల్

కేంద్ర న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
16 మే 1998 – 25 నవంబర్ 1999
ముందు రమాకాంత్ ఖళప్
తరువాత రంగరాజన్ కుమారమంగళం

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
14 మే 2009 – 21 మే 2019
ముందు కే.సి. పళనిసామి
తరువాత ఎస్. జోతిమణి
నియోజకవర్గం కరూర్
పదవీ కాలం
1998 – 1999
ముందు కె. నట్రాయన్
తరువాత ఎం. చిన్నసామి
నియోజకవర్గం కరూర్
పదవీ కాలం
1989 – 1991
ముందు ఏ.ఆర్. మురుగయ్య
తరువాత ఎన్. మురుగేశన్
నియోజకవర్గం కరూర్
పదవీ కాలం
1984 – 1989
ముందు కే. అర్జునన్
తరువాత ఎం.జి. శేఖర్
నియోజకవర్గం ధర్మపురి

ఎమ్మెల్యే
పదవీ కాలం
18 మే 2001 – 25 మే 2009
ముందు ఈ. జి. సుగవనం
తరువాత కే.ఆర్. కే. నరసింహన్
నియోజకవర్గం బర్గూర్
పదవీ కాలం
1977 – 1982
Constituency ఈరోడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-03-15) 1947 మార్చి 15 (వయసు 77)
బసవనకోవిల్, క్రిష్ణగిరి జిల్లా,
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(1972-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు డీఎంకే(1965-1972)
జీవిత భాగస్వామి భానుమతి తంబిదురై
పూర్వ విద్యార్థి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ

మునిసామి తంబిదురై (జననం 15 మార్చి 1947) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా[1], రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుండి 2019 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసి[2][3] ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

మునిసామి తంబిదురై 1965లో 18 సంవత్సరాల వయస్సులో డీఎంకేలో చేరి యువజన కార్యకర్త, విద్యార్థి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన డీఎంకేలో చేరినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి. తంబిదురై 1965లో హిందీ వ్యతిరేక ఆందోళనలో చురుకుగా పాల్గొని అరెస్టయ్యాడు. 1972లో డీఎంకే పార్టీ నుండి విడిపోయినప్పుడు ఎం.జి.ఆర్ తో కలిసి అన్నాడీఎంకే పార్టీ మొదటి తరం వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.

మునిసామి తంబిదురై ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మార్చి 1998 నుండి ఏప్రిల్ 1999 వరకు కేంద్ర న్యాయ, న్యాయ, కంపెనీ వ్యవహారాల  మంత్రిగా, 1985 నుండి 1989 వరకు తిరిగి 2014 నుండి 2019 వరకు రెండుసార్లు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, 2001 నుంచి 2006 వరకు మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం ఫలితం
1984 ధర్మపురి లోక్‌సభ సభ్యుడు గెలుపు
1989 కరూర్ లోక్‌సభ సభ్యుడు గెలుపు
1998 కరూర్ లోక్‌సభ సభ్యుడు గెలుపు
2001 బర్గూర్ శాసనసభ సభ్యుడు గెలుపు
2006 బర్గూర్ శాసనసభ సభ్యుడు గెలుపు
2009 కరూర్ లోక్‌సభ సభ్యుడు గెలుపు
2014 కరూర్ లోక్‌సభ సభ్యుడు గెలుపు
2019 కరూర్ లోక్‌సభ సభ్యుడు ఓటమి
2020 రాజ్యసభ సభ్యుడు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Fifteenth Lok Sabha Members Bioprofile: Thambidurai,Dr. Munisamy". Lok Sabha. Archived from the original on 5 June 2014. Retrieved 31 May 2014.
  2. Sakshi (12 August 2014). "లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఏకగ్రీవం!". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  3. The Hindu (13 August 2014). "Thambidurai elected LS deputy speaker" (in Indian English). Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  4. Sakshi (8 June 2019). "రాజ్యసభకు మాజీ డిప్యూటీ స్పీకర్‌..!". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.