ఎకాంతోసిస్ నైగ్రికాన్స్
ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి. సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.
చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.
లక్షణాలు
[మార్చు]చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురు రంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్ని నెలలు, సంవత్సరాలపాటు చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా దురదగా కూడా అనిపిస్తుంటుంది.
కారణాలు
[మార్చు]ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్ రెసిస్టెన్స్) : క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్‌ని శరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతి కూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్ల చర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చే అవకాశం ఉంటుంది.
- అధిక బరువు
- స్థూలకాయుల్లో చర్మం ముడతలు మందంగా నల్లగా తయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ప్రధాన కారణం అధిక బరువు. స్థూలకాయం షుగర్ వ్యాధికి ఒక ముఖ్యమైన ప్రేరకం.
- హార్మోన్ సమస్యలు
- అండాశయాల్లో నీటి బుడగలు పెరగటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథులు వ్యాధిగ్రస్తం కావటం వంటి కారణాలవల్ల చర్మపు ముడుతలు మందంగా, నల్లగా తయారవుతాయి.
- మందులు
- సంతాన నిరోధక మాత్రలు, కార్టికోస్టీరాయిడ్ మందులు, నియాసిన్ వంటి మందుల వాడకం వల్ల కూడా చర్మపు ముడతలు నల్లగా మందంగా
తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు.
- క్యాన్సర్
- శరీరపు అంతర్గ భాగాల్లో పెరిగే కాన్సర్ కణితులవల్ల కూడా చర్మం మీద ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ఆమాశయం, పెద్దప్రేగు, కాలేయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంటుంది.
ప్రేరకాలు (రిస్కులు)
[మార్చు]అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.
పరీక్షలు- నిర్ధారణ
[మార్చు]ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు: -మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?
* -మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా? -మీకు అండాశయానికి, లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా? * -మీరు ఇతర వ్యాధులకు ఏవన్నా మందులు వాడుతున్నారా?ఎప్పుడైనా స్టీరాయిడ్ మందును వాడాల్సిన అవసరం వచ్చిందా? * -ఈ లక్షణాలు ముందుగా ఎప్పుడు మొదలయ్యాయి? * -సమయం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరమవుతున్నాయా? * -మీ శరీరంలో ఏ భాగాలు వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి? * -మీకు గాని లేదా మీ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా గాని క్యాన్సర్ వచ్చిన ఇతివృత్తం ఉందా?
ఆయుర్వేద చికిత్సా వ్యూహం - డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
[మార్చు]చికిత్సల ఉద్దేశం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం, అమృత భల్లాతక లేహ్యం, లంకేశ్వర రసం, అరగ్వదాది ఉద్వర్తనం, మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలం
అల్లోపతిక్ చికిత్స
[మార్చు]కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులో ఉండేటట్లు, కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణముగా ఇది దానంతట అదే తగ్గిపోవును .. . దాని మూలాన్ని బాగుజేసుకుంటే . Restoderm or Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూతగా రాస్తే కొద్దికాలములో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును .