ఎక్స్‌ప్రెషనిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమెరికన్ నాటికలోని ఎక్స్‌ప్రెషనిజ సన్నివేశం

ఎక్స్‌ప్రెషనిజం (భావవ్యక్తీకరణవాదం) అనేది నాటకంలో ఉపయోగించే ఒక ప్రక్రియ. అస్పష్టత, క్లిష్టత, ప్రతీకలమయం పోలికలులేని వాటి మధ్య పోలికలు తెచ్చి దిగ్ర్భాంతిని తీవ్రభావావేశాన్ని కలిగించడాన్ని ఎక్స్‌ప్రెషనిజం అంటారు.[1] మామూలుగా ఉండే సహజమైన ఎక్స్‌ప్రెషన్స్ కన్నా అదనంగా, అతిగా, ఆశ్చర్యకరమైన ఎక్స్‌ప్రెషన్స్ తో దిగ్భ్రాంతికరమైన భావాలను పలికించడం, విషయాన్ని ఎగ్జాగ్జరేట్ చేసి చూపించడం, అతిశయోకక్తులను ప్రదర్శించడం, పారడీ చేయడం, హేళన వ్యక్తీకరించడం, విమర్శ ప్రస్పుటంగా చూపడం మొదలైన అతివాద ధోరణులను చూపించడానికి, విషయ తీవ్రతను ఎక్కువగా తెలపడానికి చేసే ప్రయత్నమే ఈ ఎక్స్‌ప్రెషనిజం.

ఎక్స్‌ప్రెషనిజం అనే పదాన్ని తొలిసారిగా 1901లో ఫ్రెంచి చిత్రకారుడైన జులీన్ ఆగస్టు హెర్వే చిత్రలేఖనంలో ఉపయోగించాడు. 1914లో వాల్టేర్ హసెన్ క్లెవర్ ప్రదర్శించిన ది సన్ అనే నాటకంలో ఈ ఎక్స్‌ప్రెషనిజం విజయవంతమయింది.

ఎక్స్‌ప్రెషనిజం లక్షణాలు[మార్చు]

ఎక్స్‌ప్రెషనిజం లక్షణాలను ఆర్.ఎస్. ఫ్యూర్నెస్ ఎక్స్‌ప్రెషనిజం అనే గ్రంథంలో ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు.

 1. నాటకం లేదా నాటికలో మూడ్ కు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలి
 2. సంఘటనలు ఒకదానిక వెనుక ఒకటి నడవకూడదు
 3. ముఖ్యపాత్ర ద్వారా జరుగుతున్న సంఘటనలను చూపించాలి
 4. పాత్రలకు పేర్లు ఉండవు. ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది
 5. సమకాలీన సమస్య గురించిన ఇతివృత్తం ఉండాలి
 6. నాటిక మొత్తం సీరియస్ మూడ్ లో ఉండాలి
 7. అసాధారణ మనస్తత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
 8. సంభాషణల్లో ఒకటే భావం పదేపదే పునరావృతం కావాలి
 9. నాటికలో చూపినదానికంటే సూచీప్రాయంగా వదిలేసింది ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండాలి

ఎక్స్‌ప్రెషనిజం ఉపయోగించిన కొన్ని నాటిక-నాటకాలు[మార్చు]

 1. మరో మొహెంజొదారో (నాటకం) - ఎన్.ఆర్.నంది
 2. కుక్క (నాటిక) - యండమూరి వీరేంద్రనాథ్
 3. భేకంబాకా (నాటిక) - తనికెళ్ల భరణి
 4. దొరా నీ చావు మూడింది - మొదలి నాగభూషణశర్మ
 5. ఆకలవ్యుడు (నాటిక) - డి. ప్రభాకర్
 6. డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ - ఇసుకపల్లి మోహనరావు

మూలాలు[మార్చు]

 1. తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 218), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు