ఎడమ (వామ) జఠరిక ప్రసరణ శాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎడమ జఠరిక పూర్తిగా విడుచుకొన్నప్పుడు ఉండే రక్తంలో ఎంత శాతపు రక్తం బృహద్ధమనిలోనికి ఆ జఠరిక పూర్తిగా ముడుచుకొన్నప్పుడు నెట్టబడుతుందో దానిని ఎడమ జఠరిక ప్రసరణ శాతం ( left ventricular ejection fraction ) పరిగణించాలి.

గుండెలో ఎడమ (వామ) జఠరిక ముడుచుకొన్నపుడు ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనిలోనికి నెట్టబడే రక్తపు పరిమాణం ప్రసరణ పరిమాణం గా (స్ట్రోక్ వాల్యూమ్) ఎంచుతారు. ఎడమ జఠరిక పూర్తిగా వికసించిపుడు ఎడమ జఠరికలో ఉన్న రక్తపు పరిమాణం ఎడమ (వామ) జఠరిక సంపూర్ణ వికాస పరిమాణం ( ఎండ్ డయస్టాలిక్ వాల్యూమ్). ఎడమ జఠరిక పూర్తిగా ముడుచుకొన్నపుడు ఎడమ జఠరికలో ఉండే రక్తపు పరిమాణం ఎడమ జఠరిక సంపూర్ణ ముకుళిత పరిమాణం (ఎండ్ సిస్టోలిక్ వాల్యూమ్). సంపూర్ణ వికాస పరిమాణం సంపూర్ణ ముకుళిత పరిమాణాల తేడా ప్రసరణ పరిమాణాన్ని తెలుపుతుంది. ప్రసరణ పరిమాణం, సంపూర్ణ వికాస పరిమాణాల నిష్పత్తి శాతం ఎడమ జఠరిక ప్రసరణ శాతం ( లెఫ్ట్ వెంట్రిక్యులార్ ఎజెక్షన్ ఫ్రాక్షన్) తెలుపుతుంది. ఎడమ జఠరిక ప్రసరణ శాతం ఎడమ జఠరిక కార్యనిర్వహణ సామార్థ్యాన్ని తెలుపుతుంది. ఆరోగ్యవంతులైన వయోజనులలో ఎడమ జఠరిక ప్రసరణ శాతం 50% - 75% ఉంటుంది.[1]

లెక్కింపు

[మార్చు]

ప్రసరణ పరిమాణం =  సంపూర్ణ వికాస పరిమాణం - సంపూర్ణ ముకుళిత పరిమాణం


                                                 ప్రసరణ పరిమాణం

  ఎడమ జఠరిక ప్రసరణ శాతం =       _________________                   X 100

                                        ఎడమ జఠరిక సంపూర్ణ వికాస పరిమాణం

ఉపయోగం

[మార్చు]

ఎడమ జఠరిక ప్రసరణ శాతం హృదయ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఎడమ జఠరిక వికాసంలో లోపం వలన కలిగే హృదయ వైఫల్యం వికాస వైఫల్యంగా (డయస్టాలిక్ ఫైల్యూర్) పేర్కొంటారు.[2] వీరిలో ప్రసరణ శాతం తగ్గిఉండదు. కాని ఎడమ జఠరిక బాగా వికసించకపోవుట వలన తగినంత రక్తం జఠరికలోనికి ప్రవేశించదు. ఎడమ జఠరిక సంపూర్ణ వికాస పరిమాణం తక్కువగా ఉంటుంది.

ఎడమ జఠరిక సంకోచ లోపం వలన కలిగే హృదయ వైఫల్యం ముకుళిత వైఫల్యంగా (సిస్టోలిక్ ఫైల్యూర్) పేర్కొంటారు.[1]

పరీక్షలు

[మార్చు]

వికాస పరిమాణం, ముకుళిత పరిమాణం, హృదయ నిర్మాణాన్ని తెలుసుకుందుకు శ్రవణాతీత ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం, అయస్కాంత ప్రతిధ్వని హృదయ చిత్రీకరణం, గణనయంత్ర హృదయ చిత్రీకరణం, రేడియో ధార్మిక పదార్థాలతో హృదయ చిత్రీకరణం తోడ్పడుతాయి.

హృదయ వైఫల్యాన్ని ప్రసరణశాతంను అనుసరించి రోగగతి, చేయవలసిన చికిత్సా పద్ధతులు పరిగణనలో తీసుకొని మూడు తరగతులుగా విభజిస్తారు[2]

మొదటి తరగతి: వీరిలో ప్రసరణశాతం 50% లేక అంతకుమించి, సాధారణ పరిమితుల్లో ఉంటుంది.

రెండవ తరగతి: వీరిలో ప్రసరణశాతం 41% - 49% లలో సాధారణ పరిమితుల కంటె కొద్దిగా తగ్గి ఉంటుంది.

మూడవ తరగతి: వీరిలో ప్రసరణశాతం 40% లేక అంతకంటె తక్కువలో సాధారణ పరిమితుల కంటె బాగా తక్కువగా ఉంటుంది

  1. 1.0 1.1 "Ejection Fraction | UpBeat.org - powered by the Heart Rhythm Society". upbeat.org. Retrieved 2023-09-17.
  2. 2.0 2.1 academic.oup.com https://academic.oup.com/eurheartj/article/37/27/2129/1748921?login=false#109986804. Retrieved 2023-09-17. {{cite web}}: Missing or empty |title= (help)