ఎడ్ల పోటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎద్దులతో బండ లాగించడం లేదా బండ్లు లాగించడం లేదా బండిని వేగంగా నడిపించడం వంటివి పోటీలా నిర్వహించే కార్యక్రమాన్ని ఎడ్లపోటీ అంటారు. ఈ పోటీలను బహిరంగంగా నిర్వహించి బహుమతులను కూడా ఇస్తారు, ఈ పోటీలు సాధారణంగా ఒక ప్రత్యేక సందర్భంలో నిర్వహిస్తారు. కొన్ని తిరునాళ్లలో వార్షికంగా ఈ ఎడ్ల పోటీలను నిర్వహిస్తుంటారు. ఈ పోటీలలో ఎద్దులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఈ పోటీలను ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తారు, కొన్ని ప్రాంతాల్లో జరిగే ఈ పోటీలను తిలకించేందుకు దూరదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది వస్తారు. ఈ పోటీల నిర్వహణ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున పోలీసువారు కొన్ని నియమాలను సూచించి పోటీలు సక్రమంగా జరిగేలా సహకరిస్తారు. ఈ ఎడ్లపోటీ లేదా ఎడ్లపందెం తెలుగు వారి సంస్కృతిలో ఒక భాగమైంది.

పందెం ఎడ్లు[మార్చు]

పోటీల కోసం లేదా పందేల కోసం ప్రత్యేకంగా పెంచే ఎద్దులను పందెం ఎడ్లు అంటారు. ఈ ఎద్దులను ఆదాయం కోసం కన్నా పేరు ప్రతిష్టల కోసం ప్రత్యేకంగా పెంచుతారు. ఈ ఎద్దులకు ప్రత్యేక ఆహారాన్నివ్వడంతో పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పందేలకు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎద్దులను ఉపయోగిస్తారు. పూర్వం నుంచే ఎడ్లపోటీల కోసం ప్రత్యేకంగా ఎద్దులను పెంచేవారు. ముఖ్యంగా బండ లాగుడు పోటీల కోసం ఈ ఎద్దులను పెంచుతారు.


ఇవి కూడా చూడండి[మార్చు]

  • జల్లికట్టు - తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట
  • కోడిపందెం - రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ
"https://te.wikipedia.org/w/index.php?title=ఎడ్ల_పోటీ&oldid=1169182" నుండి వెలికితీశారు