Jump to content

ఎదీమా

వికీపీడియా నుండి
ఏదీమా
ఇతర పేర్లుఎడెమా, ఎడెమా, ద్రవం నిలుపుదల, నీరు పట్టడం, చుక్కలు, హైడ్రాప్సీ, వాపు
పిట్టింగ్ ఏదీమా
ఉచ్చారణ
ప్రత్యేకతకార్డియాలజీ, నెఫ్రోలజీ
లక్షణాలుచర్మం బిగుతుగా అనిపించడం, ఆ ప్రాంతం భారంగా అనిపించడం
సాధారణ ప్రారంభంఅకస్మాత్తుగా లేక క్రమంగా
రకాలుసాధారణమయినవి, స్థానికంగా కనపడేవి
కారణాలుసిరల లోపము, గుండె వైఫల్యం, మూత్రపిండ సమస్యలు, హైపోఅల్బుమినిమియా అంటే తక్కువ ప్రోటీన్ స్థాయిలు, కాలేయం సమస్యలు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, లింఫెడెమా
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాల పరీక్ష
చికిత్సఅంతర్లీన కారణం అనుసరించి

ఎదీమా , దీనిని వాపు అని నీరు పట్టడం అని కూడా పిలుస్తారు, ఇది శరీర కణజాలం నుంచి ఏర్పడిన ద్రవం ఒక భాగం లో నిలిచి పోవడం వలన సంభవిస్తుంది. చాలా సాధారణంగా, కాళ్ళు లేదా చేతులు ఈ పరిస్థితికి ప్రభావితమవుతాయి. ముఖ్యంగా దీనివలన చర్మం బిగుతుగా అనిపిస్తుంది, ఆ భాగం భారీగా అనిపించవచ్చు. ప్రభావిత ప్రాంతంలో కీళ్ళు కదలడం కష్టం కావచ్చు.[1] ఇతర లక్షణాలు అంతర్లీన కారణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.[2]

సిరల లోపం, గుండె వైఫల్యం, మూత్రపిండ సమస్యలు, మాంసకృతులు తక్కువ స్థాయిలో ఉండడము, కాలేయ సమస్యలు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (కాళ్ళ భాగంలోకానీ, కటి భాగంలో కానీ సిరలలో ఏర్పడ్డ రక్తం గడ్డ), సంక్రమణాలు, ఆంజియోఎదీమా, కొన్ని రకాల మందులు లింఫెడెమా వంటివి కారణాలు కావచ్చు.[1][2] ఇది ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో కూడా సంభవించవచ్చు.[1] ఇది అకస్మాత్తుగా ప్రారంభమైతే, లేదా నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది.[2]

చికిత్స అంతర్లీన కారణంపై ఆధారపడి ఉంటుంది. అంతర్లీన విధానంలో సోడియం నిలుపుదల (retention) ఉంటే, ఉప్పు తక్కువ తీసుకోవలసి వస్తుంది. మూత్రవర్ధకాలను (డైయూరటిక్స్ ) ఉపయోగించవచ్చు.[2] కాళ్లు పైకి లేపి ఉంచడం, మద్దత్తుగా నిలిచే మేజోళ్ళు ధరించడం కాళ్ళ వాపు కు ఉపశమనం గా ఉపయోగపడుతుంది. వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు.[3] ఈ పదం గ్రీకు οἴδημα oídēma నుండి వచ్చింది, దీని అర్థం 'వాపు'.[4]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Causes and signs of edema (in ఇంగ్లీష్). Institute for Quality and Efficiency in Health Care (IQWiG). 2016. Archived from the original on 2021-08-29. Retrieved 2019-12-08.
  2. 2.0 2.1 2.2 2.3 "Edema - Cardiovascular Disorders". Merck Manuals Professional Edition. Archived from the original on 13 October 2019. Retrieved 8 December 2019.
  3. "Edema: Causes, Symptoms, Diagnosis & Treatment". familydoctor.org. Archived from the original on 1 August 2019. Retrieved 23 December 2019.
  4. Liddell, Henry. "A Greek-English Lexicon, οἴδ-ημα". www.perseus.tufts.edu. Archived from the original on 7 July 2015. Retrieved 8 December 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎదీమా&oldid=4289110" నుండి వెలికితీశారు