ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
Edurinti Mogudu Pakkinti Pellam.jpg
దర్శకత్వంరేలంగి నరసింహారావు
నటవర్గంరాజేంద్ర ప్రసాద్,
దివ్యవాణి,
వై.విజయ
సంగీతంజె. వి. రాఘవులు
భాషతెలుగు

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 1991లో విడుదలైన హాస్యభరిత చిత్రం. రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జె. వి. రాఘవులు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

కథ[మార్చు]

బాధలబందీ వరప్రసాద్ అలియాస్ బావ ఒక పిసినారి. పట్నంలో ఉంటూ కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. తను అద్దెకున్న ఇంటిలో ఉన్న జయలక్ష్మిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. కానీ పెళ్ళైన తర్వాత అతని పిసినారితనం గురించి తెలుసుకుని గర్భంతో ఉండగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఏడేళ్ళ తర్వాత తన భర్త ఉన్న ఇంటికి పక్కనే మరో ఇంట్లో అద్దెకు దిగుతుంది. వారి కుమారుడు శ్రీధర్. తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీధర్ అచ్చం తండ్రిలాగే పిసినారి చేష్టలు చేస్తూ బావ తన తండ్రి అని తెలియకుండానే దగ్గరవుతాడు. దాంతో ఆమె మళ్ళీ ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఈలోపు బావ తల్లి తన మాటకు వ్యతిరేకంగా పెళ్ళి చేసుకున్న కుమారుడిని చాలా రోజుల తర్వాత చూడటానికి వచ్చి భార్య అతన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకుని బాధ పడుతుంది. కోడలు ఎక్కడుందో తెలుసుకుని ఆమె దగ్గర పనిమనిషిగా చేరి మనవణ్ణి చూసుకుంటూ ఉంటుంది. కొంతకాలానికి జయకు ఆమె తన అత్త అని నిజం తెలుసుకుని చాలా బాధపడుతుంది. జయ బాస్ అయిన ఉష సింఘాల్ బావ ప్రవర్తనను మార్చాలని ఒక పథకం వేస్తుంది. అతనికి మెదడు క్యాన్సర్ ఉందని నమ్మించి డబ్బు పట్ల అతనికున్న ధృక్పథాన్ని మారుస్తుంది. మారిన బావ తన ప్రవర్తనను క్షమాపణలి చెప్పుకుని కుటుంబ సభ్యులందరితో కలుస్తాడు. ఈలోపు అతని రోగం ఉత్తిదేనని తెలుస్తుంది. అందరూ సంతోషంగా కలిసుండటంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

  • బాధలబందీ వరప్రసాద్ అలియాస్ బావగా రాజేంద్ర ప్రసాద్
  • జయలక్ష్మి అలియాస్ జయగా దివ్యవాణి
  • సుత్తివేలు
  • శ్రీలక్ష్మి
  • అన్నపూర్ణ
  • వై. విజయ
  • బాలాదిత్య
  • పుల్లయ్యగా మల్లికార్జునరావు
  • అప్పారావుగా బాబు మోహన్

మూలాలు[మార్చు]