ఎదురు అరటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎదురు అరటి
అడవి అరటి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
జాతులు

మ్యాసా బల్బీసియానా సంకర మూలం; పాఠ్యం చూడండి.


ఎదురు అరటి లేదా అడవి అరటి అనేది అరటిలో ప్రత్యేకమైన రకం, దీనిలో నల్లటి పెద్ద గింజలు వుంటాయి. గెలలో అరటి మామూలు అరటిలా కాకుండా ఎదురు దిశలో వుంటాయి. ముసా బాల్బిసియానా అనేది తూర్పు దక్షిణ ఆసియా, ఉత్తర ఆగ్నేయాసియా, దక్షిణ చైనాకు చెందిన అరటి రకం అడవి రకం. దీనిని మొట్టమొదట శాస్త్రీయంగా 1820 లో ఇటాలియన్ వృక్షశాస్త్రజ్ఞుడు లుయిగి అలోసియస్ కొల్లా వర్ణించారు.అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క. ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది.[1]

నిర్మాణము వర్ణన[మార్చు]

ఇది మామూలు అరటికన్నా నిటారుగా పొడవుగా పెరుగుతుంది. ఆకులు దగ్గర దగ్గరగా గుబురుగా పెరుగుతాయి. ఆకుపచ్చటి రంగుని కలిగివుంటాయి. పువ్వులు ఎరుపు నుండి మెరూన్ రంగులలో కనిపిస్తాయి. పండు నీలం, ఆకుపచ్చ రంగులలో వుంటుంది. గెలలోని పండ్లు భూమి ఆకర్షణ వైపుగా కాక దానికి వ్వతరేఖ దిశలో అమర్చినట్లు వుంటాయి అందువల్లనే వాడుకలో దీనిని ఎదురు అరటి అంటారు. సాగుచేసే తోటలలో కంటే విడిగా బంజరు నేలల్లో పెరగటంతో అడవి అరటి అంటారు. అరటి పండ్ల లోపట నల్లని పెద్ద పరిమాణంలోని గింజలు వుంటాయి.

చరిత్ర[మార్చు]

అరటి చెట్ల పుట్టుక అనునది ఆసియా వాయువ్య దేశాలలో సంభవించింది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పౌపా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తుకు పూర్వం 8000 లేదా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించారు. దీని వల్ల న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు అనిపిస్తుంది.

ఉపయోగాలు[మార్చు]

అడవి అరటిలో కనిపిస్తున్న విత్తనాలు

ఇవి పచ్చిగా వున్నప్పుడు ఇతర కూర అరటి కాయల లాగానే కూరకోసం వాడవచ్చు. పండిన తర్వాత తినడానికి ఉపయోగపడతాయి. అడవులలో వీటిని పెంచడం ద్వారా పట్టణాలలోకి వచ్చే కోతుల వలసలను తగ్గించ వచ్చు మళ్ళీ వాటి సహాయంతోనే విత్తన వ్యాప్తికి అవకాశం వుంటుంది. [2]

కూర అరటిలో ఇతర రకాలు
 • పచ్చబొంత
 • బూడిద బొంత
 • పచ్చబొంత బత్తీసా
 • బూడిద బొంత బత్తీసా
 • పచ్చగుబ్బబొంత
 • పలకల బొంత
 • నూకల బొంత
 • సపోటా బొంత
 • నేంద్రం
 • సిరుమల అరటి
 • వామనకేళి

ఇవి కూడా చూడండి[మార్చు]

అరటి పండు పండ్ల జాబితా

మూలాలు[మార్చు]

 1. Musa balbisiana Archived అక్టోబరు 13, 2008 at the Wayback Machine
 2. "అరటిపండు మీ ఆరోగ్యనికి ఎల ఉపయొగమొ ఇక్కడ చుడండి". Archived from the original on 2016-09-11. Retrieved 2020-07-17.

బయటిలంకెలు[మార్చు]