Jump to content

ఎన్.ఎస్.వి.చిత్తన్

వికీపీడియా నుండి
ఎన్.ఎస్.వి.చిత్తన్
ఎన్.ఎస్.వి.చిత్తన్

పళని వద్ద భారత్ నిర్మాణ్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ కేంపయిన్ వద్ద ప్రసంగిస్తున్న ఎన్.ఎస్.వి.చిత్తన్


పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం దిండిగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1934-04-12) 1934 ఏప్రిల్ 12 (వయసు 90)
తిరుమంగళం, తమిళనాడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శకుంతల చిత్తన్
నివాసం మధురై

శ్రీ ఎన్.వి.ఎస్. చిత్తన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున తమిళనాడులోని దిండిగల్ పార్లమెంటు నియోజిక వర్గం నుండి పోటీ చేసి లోక్ సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.

బాల్యం

[మార్చు]

శ్రీ చిత్తన్ గారు 1934 ఏప్రిల్ 12 లో తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగలంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ ఎన్.ఎస్.వీరపథిర థేవర్, శ్రీమతి సుబ్బమ్మాళ్.

విద్య

[మార్చు]

వీరు తమ విద్యాభ్యాసాన్ని మధురై లోని మధురై కాలేజ్,, త్యాగరాజర్ కాలేజ్ లలో కొనసాగించి బి.ఎ. పట్టా పొందారు.

కుటుంబము

[మార్చు]

వీరు 10 మయ్ 1959 లో శ్రీమతి శకుంతల చిత్తన్ గారిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ ప్రస్తానము

[మార్చు]

వీరు 1967 - 71 లో, 1980-89 మధ్య కాలంలో తమిళనాడు శాసన సభలో సభ్యునిగా మూడు సార్లు ఉన్నారు. తమిళ నాడు అసెంబ్లీలో పి.ఎ.సి. చైర్ మెన్ గా 1980-84 వరకు ఉన్నారు. 1996 లో 11 వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1996 -97 మద్య కాలంలో తమిళ మానిల కాంగ్రెస్ కు నాయకుడుగా ఉన్నారు. 2004 వరకు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యునిగా ఉన్నారు. 2009 లో గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరుపున తమిళనాడులోని దిండిగల్ పార్లమెంటు నియోజిక వర్గం నుండి పోటీ చేసి లోక్ సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. వీరు 1967 - 71 మద్య కాలంలో తమిళనాడు శాసన సభలో 7,000 లకు పైగా ప్రశ్నలు సందించినందుకు గాను వెండి పథకమును అందుకున్నారు. భారతదేశం తరుపున ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొన్నారు.

అభిరుచులు

[మార్చు]

వీరికి ఆధ్యాత్మిక పుస్తకాలపై ఎక్కువ మక్కువ. హాకి, బాస్కెట్ బాల్ వంటి ఆటలలోకూడ అవగాహన ఉంది.

విదేశీ పర్యటన

[మార్చు]

ఇతను శ్రీలంక, తజికిస్తాన్, అమెరికా వంటి దేశాలలో పర్యటించారు.

మూలాలు

[మార్చు]