ఎన్.చెన్నకేశవయ్య
Jump to navigation
Jump to search
ఎన్.చెన్నకేశవయ్య | |
---|---|
![]() ఎన్.చెన్నకేశవయ్య | |
జననం | 1895 మైసూరు రాజ్యం, నాటనహళ్ళి |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసుడు, పండితుడు |
ఎన్.చెన్నకేశవయ్య మైసూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు.
విశేషాలు[మార్చు]
ఇతడు 1895లో మైసూరు రాజ్యం (ప్రస్తుతం మండ్య జిల్లా)లోని నాటనహళ్ళి అనే గ్రామంలో కేశవయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు వి.శివరామయ్య, మైసూరు కె.వాసుదేవాచార్యల వద్ద సంగీత శిక్షణ తీసుకున్నాడు. ఇతడు కర్ణాటక గాత్ర విద్వాంసుడు మాత్రమే కాక సంగీత సంబంధమైన అనేక గ్రంథాలను రచించాడు. ఇతడు మైసూరు సంస్థానంలో జయచామరాజ ఒడయార్ వద్ద 1944-1957ల మధ్య ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉన్నాడు. 1963లో ఇతనికి కర్ణాటక రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[1] 1971లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక గాత్ర సంగీత విభాగంలో అవార్డును ప్రకటించింది. ఇతనికి "గానకళాసింధు" అనే బిరుదు లభించింది.
రచనలు[మార్చు]
- హరిదాస కీర్తన సుధాసాగర (3 సంపుటాలు)
- రాగ ఆలాపన పద్ధతి తాన మత్తు పల్లవి - లఘుకైపిడి