ఎన్.పి.చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరంజన్ ప్రసాద్ చక్రవర్తి
OBE
జననం(1893-07-01)1893 జూలై 1
మరణం1956 అక్టోబరు 19(1956-10-19) (వయసు 63)
వృత్తిఎపిగ్రాఫిస్ట్, ఆర్కియాలజిస్ట్

నిరంజన్ ప్రసాద్ చక్రవర్తి OBE (1893 జూలై 1 – 1956 అక్టోబరు 19) భారతీయ పురావస్తు శాస్త్రవేత్త. అతను 1934 నుండి 1940 వరకు భారత ప్రభుత్వానికి చీఫ్ ఎపిగ్రాఫిస్ట్‌గా, 1948 నుండి 1950 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు.

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

చక్రవర్తి బెంగాల్ ప్రెసిడెన్సీ, నాడియా జిల్లాలోని కృష్ణానగర్‌లో 1893 జూలై 1న జన్మించాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో సంస్కృతం, పాళీ అధ్యాపకుడిగా పనిచేశాడు. 1921లో స్కాలర్‌షిప్‌పై పారిస్‌లోని సోర్బోన్, బెర్లిన్ విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తరువాత చక్రవర్తి, యునైటెడ్ కింగ్‌డమ్‌ వెళ్లి 1926లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందాడు.

కెరీర్

[మార్చు]

చక్రవర్తి 1929 లో భారతదేశానికి తిరిగి వచ్చి ఊటీలో ఎపిగ్రఫీ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా చేరాడు. 1934 లో భారత ప్రభుత్వానికి చీఫ్ ఎపిగ్రాఫిస్ట్‌గా పదోన్నతి పొందాడు. 1940 లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొంది 1945 లో జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా మారాడు. 1948 లో చక్రవర్తి, మోర్టిమర్ వీలర్ తర్వాత ASI కి డైరెక్టర్ జనరల్‌ పదవిని చేపట్టి, 1950 వరకు పనిచేశాడు.

తరువాత జీవితంలో

[మార్చు]

పదవీ విరమణ తరువాత చక్రవర్తి, భారత ప్రభుత్వ ఆర్కియాలజీ విభాగానికి సలహాదారుగా నియమితుడయ్యాడు. 1952 వరకు పనిచేశారు. చక్రవర్తి 1956 అక్టోబరు 19 న న్యూఢిల్లీలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  • Obituary (PDF). Vol. 31. {{cite book}}: |work= ignored (help)
అంతకు ముందువారు
మోర్టిమర్ వీలర్
భారత పురాతత్వ సర్వేక్షణ డైరెక్టర్ జనరల్
1948 - 1950
తరువాత వారు
మధో సరూప్ వత్స్