ఎన్.రెడ్డప్ప
నల్లకొండ గారి రెడ్డప్ప | |||
పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | నారమల్లి శివప్రసాద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వల్లిగట్ల , చిత్తూరు జిల్లా, మద్రాసు రాష్ట్రం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్) | 1951 అక్టోబరు 1||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | కొండయ్య, వెంకటమ్మ | ||
జీవిత భాగస్వామి | ఎన్. రెడ్డమ్మ | ||
సంతానం | దినేష్ ( లెఫ్టినెంట్ ఆర్మీ కర్నల్) |
నల్లకొండ గారి రెడ్డప్ప ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు . అతను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన పుట్టనూర్ గ్రామానికి చెందినవాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్.రెడ్డప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా 14 సార్లు పని చేశాడు.ఎన్.రెడ్డప్ప 1981 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఏడాది పాటు , ఏజీపీగా 1984 నుంచి 1987 వరకు, ఎస్‌బీఐ, సప్తగిరి గ్రామీణబ్యాంకు, మున్సిపాలిటీకి, ఇతర ప్రైవేటు కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పని చేశాడు.
ఎన్.రెడ్డప్ప కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మినరల్ డైవలెఫ్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా , కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ డైరెక్టర్‌గా 2008–2009లో పని చేసి, దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Chittoor Election Results 2019". Times Now. 23 May 2019. Archived from the original on 23 మే 2019. Retrieved 24 May 2019.
- ↑ "Chittoor LS Seat Poses A Tough Challenge To TDP". Sakshi Post. 31 March 2019. Archived from the original on 21 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
- ↑ "Crushing defeat for TDP in Naidu's home turf of Chittoor". The Hindu. 25 May 2019. Retrieved 22 August 2019.