Jump to content

ఎన్.సి.గోపాలాచారి

వికీపీడియా నుండి

ఎన్.సి.గోపాలాచారి పొగాకు సేద్య రంగ శాస్త్రవేత్త. ఆయన పొగాకు సేద్య విధానాలపై విశేష పరిశోధనలు చేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఆర్తమూరు. ఆయన రాజమండ్రిలో అక్టోబరు 5 1925 న జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి (అగ్రికల్చర్) పూర్తి చేసి (1950),[1] 1961 లో పి.హెచ్.డి పూర్తి చేసారు.[2][3]

ఉద్యోగపర్వం

[మార్చు]

ఆయన తొలిగా కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో రసాయనశాస్త్ర సహాయకులుగా (1951) చేరారు. 1952 లో రాజమండ్రి లోని సెంట్రల్ టుబాకో రీసెర్చె ఇనిస్టిట్యూట్ లో ప్లాంట్ ఫిజియాలజీ రీసెర్చి అసిస్టెంటుగా పరిశోధనలు చేసారు. మాస్కో స్టేట్ యూనివర్శిటీలో రెండున్నర సంవత్సరాలు పోస్టు డాక్టరల్ రీసెర్చి (1959-62) చేసి వ్యవసాయంలో రేడియో ఐసోటోపుల వినియోగం గూర్చి అధ్యయనం చేసారు. 1962 లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో బోటనీ విభాగంలో సి.ఎస్.ఐ.ఆర్ సైంటిఫిక్ ఆఫీసరుగా ఉంటూ పి.జి.విద్యార్థులకు A method to determine the terminal enzymes catalyses, peroxides and poly phenol oxidase మీద బోధించారు. తదనంతరం రాజమండ్రి సి.టి.ఆర్.ఐలో బయో కెమిస్టుగా చేరి, డైరక్టరుగా పదోన్నతి పొంది (1972) పదవీ విరమణ చేసారు.[4] ఈయన హయాంలో ఈ పరిశోధనాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. నూతన పరిశోధన భవన సముదాయాన్ని, అత్యాధునిక పరిశోధన సంపత్తిని, పలు వినూత్న పరిశోధన విభాగాలను అందుకొని సి.టి.ఆర్.ఐ మహోన్నత దశకు చేరుకున్నది.

పరిశోధనలు

[మార్చు]

ఈయన పారిశ్రామిక వ్యర్థాల నుండి ఉష్ణశక్తిని పొంది పొగాకు క్యూరింగుకు ఉపయోగించి, ప్రత్యామ్నాయ శక్తి వనరులను కనుగొనడం ద్వారా 30 శాతం వ్యయాన్ని తగ్గించారు. "లో ప్రొపైల్ బార్న్" రూపకల్పన చేసి 42 శాతం ఇంధనాన్ని, 21 గంటలు సమయాన్ని అదా చేసారు.[5][6] ఈ పరిశోధన దేశవ్యాప్త విజయం పొందింది.ఈయన 1982 లో సోలార్ బార్న్ ను రూపకల్పన చేసారు.[7] దీని ఫలితంగా దాదాపు 60 శాతం ఇంధనం ఆదా అయింది.

రచనలు

[మార్చు]

అనేక పుస్తకాలను రచించారు.[8] ఆయన 1984 లో "టొబాకో", 1985 లో "టొబాకో ఆఫ్ ఇండియా", అనే ప్రసిద్ధ గ్రంథాలను వ్రాసారు.[9]

గౌరవ చిహ్నం

[మార్చు]

ఈయన జాతీయ స్థాయిలో అనేక ప్రతిష్ఠాత్మక టొబాకో సంస్థలలో గౌరవ పదవులు నిర్వహించారు. జపాన్, జర్మనీ దేశాలలో ప్రభుత్వం తరపున పర్యటించారు. రాజమండ్రి పట్టణానికి దేశవ్యాప్త ఘనతను చేకూర్చిన ఈయన గౌరవార్థం ఐ.సి.ఎ.ఆర్ సెంట్రల్ టొబాకో రీసెర్చి ఇనిస్టిట్యూషన్ ఉన్న ఒక వీధికి ఈయన పేరుతో "ఎన్.సి.గోపాలాచారి రోడ్డు" అని నామకరణం చేసారు.[10]

అస్తమయం

[మార్చు]

ఆయన జనవరి 18, 2012 న మరణించారు.[11]

మూలాలు

[మార్చు]
  1. బనారస్ విశ్వవిద్యాలయం లో పిహెచ్ డి వివరాలు
  2. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 45.
  3. hindu article on RAJAHMUNDRY edition, January 19, 2012
  4. "సి.టి.ఆర్.ఐ వెబ్ సైటు". Archived from the original on 2015-05-09. Retrieved 2015-05-24.
  5. Indian Standard CODE OF PRACTICE FOR CONSTRUCTION OF FLUE-CURING TOBACCO BARNS[permanent dead link]
  6. IS:4469 -1985 Indian Standard CODE OF PRACTICE FOR CONSTRUCTION OF FLUE-CURING TOBACCO BARNS[permanent dead link]
  7. acknowledgements to n.c.gopalachari
  8. గూగుల్ గ్రూప్స్ లో ఆయన పుస్తకాల వివరాలు
  9. google books, Tobaco
  10. "the name of the road in the address of ICAR" (PDF). Archived from the original (PDF) on 2015-05-05. Retrieved 2015-05-24.
  11. Former CTRI Director dead

ఇతర లింకులు

[మార్చు]