Jump to content

ఎన్. కృష్ణారెడ్డి (కళాకారుడు)

వికీపీడియా నుండి
కృష్ణారెడ్డి
జననం(1925-07-15)1925 జూలై 15
నందనూరు, చిత్తూరు జిల్లా, మద్రాసు రాజ్యం, బ్రిటిష్ ఇండియా.
మరణం2018 ఆగస్టు 22(2018-08-22) (వయసు 93)
న్యూయార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఇతర పేర్లుఎన్. కృష్ణారెడ్డి
విద్యస్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
విద్యాసంస్థకళాభవన
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చిత్రకారుడు, శిల్పి
జీవిత భాగస్వామిజుడీ బ్లమ్‌ రెడ్డి

కృష్ణారెడ్డి (1925 జూలై 15 - 2018 ఆగస్టు 22) [1][2] భారతీయ శిల్పి, ఉపాధ్యాయుడు. [3] అతను రూపొందించే గ్రాఫిక్స్‌లోని టెక్నిక్, శిల్పాలలోని పనితనం కృష్ణారెడ్డికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన రేఖలలో లావణ్యం, రంగులలో రమణీయత, భావనలో సౌందర్యం, శైలిలో నవ్యత చిత్ర కళారాధకులను మైమరిపించాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1925 జులై 15న చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం నందనూరులో జన్మించాడు. [4][5] అతను 1941లో శాంతినికేతన్ ఆధ్వర్యంలోని విశ్వభారతి యూనివర్సిటీలో చేరి 1946లో ఫైన్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకున్నాడు. [3][4] 1947 నుంచి 1950 వరకు మద్రాస్ ‘కళక్షేత్ర’లో కళావిభాగానికి అధికారిగా వ్యవహరించాడు.[4] 1949లో లండన్ కు పయనమై లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నందు శిక్షణ పొందాడు.[4] పారిస్‌లో శిల్పకళకు సంబంధించి అభ్యాసం చేశాడు. అతను ప్రత్యేకంగా ఇంటాగ్లియో ప్రింటింగ్ అనే ప్రక్రియలో ప్రవీణుడు. అమెరికాలోని అనేక ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలకు గెస్ట్ ప్రొఫెసర్‌గా వ్యవహరించాడు. అతను ప్రపంచ అత్యుత్తమ ముద్రణా పరిజ్ఞానులలో ఒకరిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించాడు. రంగుల ముద్రణలో వివిధ నూతన ముద్రణా ప్రక్రియలను, విధానాలను కృష్ణారెడ్డి ప్రవేశ పెట్టాడు. అవి ఎంతో ప్రఖ్యాతి గడించాయి. పారిస్‌లో సుప్రసిద్ధ శిల్పి ఒ.జడ్కిన్‌తో శిల్పంలో, మిలాన్‌లో- మెరినో మెరినోతో ప్రింట్స్ రూపొందించడంలో కలిసి పని చేస్తూనే చిత్రకళను అధ్యయనం చేశాడు. 1965 నుంచి పారిస్‌లోని ‘అటులియర్ 17’ స్టూడియోకు అసోసియేట్ డైరెక్టర్‌గా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ విభాగానికి ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు.

పురస్కారాలు

[మార్చు]

కృష్ణారెడ్డి చిత్రకళా ప్రావీణ్యతకు 1972లో భారత ప్రభుత్వం నుండి ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.[6] 1980 లో శాంతినికేతన్ విశ్వభారతి విశ్వ విద్యాలయం నుండి ‘గగన్ అబానీ’ పురస్కారాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అందుకున్నాడు. అదే సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1997లో అఖిల భారత లలిత కళల సంఘం ఆయనను కళారత్న పురస్కారంతో సత్కరించింది. వందలాది దేశీయ, అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో కృష్ణారెడ్డి చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఇతర పఠనాలు

[మార్చు]
  • Bartholomew, Richard (1974). Krishna Reddy. New Delhi.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  • Krishna’s Cosmos: The Creativity of an Artist, Sculptor & Teacher. Ahmedabad: Mapin Publishing. 2003.

మూలాలు

[మార్చు]
  1. "Krishna Reddy (1925–2018)". www.artforum.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-08-26.
  2. "Art Industry News". artnet News (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-24. Retrieved 2018-08-26.
  3. 3.0 3.1 Sharma, Sumesh (18 October 2016). "Krishna Reddy and Atelier 17: A "New Form" Takes Shape". The Metropolitan Museum of Art (The Met). Retrieved 26 March 2018.
  4. 4.0 4.1 4.2 4.3 "KRISHNA REDDY : biographical journey" (PDF). Indira Gandhi National Centre for the Arts.
  5. "Krishna Reddy". www.askart.com. Retrieved 2018-08-26.
  6. "Sans titre". Bureau d'Art Public – Ville de Montréal.

ఇతర లింకులు

[మార్చు]
  • http://epaper.andhrajyothy.com/c/31696602[permanent dead link]
  • http://www.andhrajyothy.com/artical?SID=6[permanent dead link]27224[permanent dead link]