ఎబాదత్ హుస్సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎబాదత్ హుస్సేన్ చౌధురి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎబాదత్ హుస్సేన్ చౌధురి
పుట్టిన తేదీ (1994-01-07) 1994 జనవరి 7 (వయసు 30)
బార్లేఖా, బంగ్లాదేశ్
మారుపేరుSylhet Rocket[1]t
ఎత్తు5 అ. 11 అం. (180 cమీ.)[2]
బ్యాటింగుRight handed
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 95)2019 ఫిబ్రవరి 28 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - Afghanistan తో
తొలి వన్‌డే (క్యాప్ 139)2022 ఆగస్టు 10 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 మార్చి 23 - ఐర్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.58
తొలి T20I (క్యాప్ 77)2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో
చివరి T20I2022 నవంబరు 6 - పాకిస్తాన్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.58
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 17 6 47 19
చేసిన పరుగులు 33 0 127 26
బ్యాటింగు సగటు 2.53 3.17 3.71
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 21* 0* 21* 11
వేసిన బంతులు 2,927 158 7,669 905
వికెట్లు 31 17 127 27
బౌలింగు సగటు 56.45 14.44 33.07 29.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 4 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/46 4/47 6/46 4/46
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 9/– 1/–
మూలం: ESPNcricinfo, 11 March 2023

ఎబాదత్ హుస్సేన్ చౌధురి ( జననం 1994 జనవరి 7), బంగ్లాదేశ్ క్రికెటరు. అతను 2019 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగు పెట్టాడు.[3] అతని వేగం, నైపుణ్యాల కారణంగా అతనికి 'సిల్హెట్ రాకెట్' అనే పేరు వచ్చింది.[4] అతను బంగ్లాదేశ్ వైమానిక దళంలో సైనికుడు కూడా.[5]

జీవితం తొలి దశలో

[మార్చు]

ఎబాదత్ హుస్సేన్ చౌధురి 1994 జనవరి 7న మౌల్విబజార్ జిల్లాలోని బార్లేఖాలోని కథల్తాలి గ్రామంలో చౌదరీలకు చెందిన సిల్హెటి ముస్లిం కుటుంబంలో జన్మించారు. [6] నిజాముద్దీన్ చౌదరి, సమియా బేగంల ఆరుగురు పిల్లలలో అతను రెండవవాడు. [7]

2012లో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో వాలీబాల్ ప్లేయర్‌గా ఎబాదత్ హుస్సేన్ చేరాడు. [8] 2016లో, అతను ఆకిబ్ జావేద్ పర్యవేక్షణలో BCB నిర్వహించిన పేసర్ హంట్ పోటీకి హాజరయ్యాడు. BCB హై-పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ కోసం ఎబాదత్‌ను ఆకిబ్ ఎంచుకున్నాడు. దాంతో, ఎబాదత్ వాలీబాల్ ఆటగాడి నుండి క్రికెటరుగా మారాడు.[9]

దేశీయ కెరీర్

[మార్చు]

2016 సెప్టెంబరు 25న 2016–17 నేషనల్ క్రికెట్ లీగ్‌లో సిల్హెట్ డివిజన్‌కు ఎబాదత్ ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [10] 2017 మే 8న 2016–17 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్‌ తరఫున తన తొలి లిస్టు Aమ్యాచ్‌ ఆడాడు.[11] 2017–18 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2017 నవంబరు 6న రంగ్‌పూర్ రైడర్స్ తరపున ట్వంటీ20 ల్లోకి అడుగుపెట్టాడు.[12] ఎబాదత్ 2017–18 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో సెంట్రల్ జోన్ తరపున ఆరు మ్యాచ్‌లలో పదమూడు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[13]

2018 అక్టోబరులో ఎబాదత్, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సిల్హెట్ సిక్సర్స్ జట్టులో చేరాడు. [14] మరుసటి నెలలో, 2018–19 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో నార్త్ జోన్ తరపున బౌలింగ్ చేస్తూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతను తన తొలి పది వికెట్ల పంట సాధించాడు. [15] 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో చేర్చిన 35 మంది క్రికెటర్లలో అతనొకడు. [16]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2016 నవంబరులో, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందేందుకు 22 మంది ఆటగాళ్ళ సన్నాహక బృందంలో ఎబాదత్ ఎంపికయ్యాడు. [17]

2019 ఫిబ్రవరిలో, న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం బంగ్లాదేశ్ టెస్టు జట్టులోకి ఎబాదత్‌ను తీసుకున్నారు. [18] అతను 2019 ఫిబ్రవరి 28న న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ తరపున టెస్టు రంగప్రవేశం చేసాడు. అతని మొదటి టెస్టు వికెట్ నీల్ వాగ్నర్. [19]


2022 జనవరిలో, సిరీస్‌లోని మొదటి టెస్టులో బే ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో అతను తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. [20] అతని 6/46, బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌పై మొదటి విజయం సాధించడంలోను, న్యూజిలాండ్‌పై వారి మొదటి టెస్టు విజయాన్ని సాధించడంలోనూ సహాయపడింది. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ఎబాదత్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. [21] [22]

2022 ఫిబ్రవరిలో, అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [23] 2022 మార్చిలో, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [24] 2022 మేలో, ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం అతన్ని జట్టు లోకి తీసుకున్నారు. [25] 2022 ఆగష్టులో, జింబాబ్వే పర్యటన కోసం వన్‌డే జట్టులో ఎంపికయ్యాడు. [26] 2022 ఆగస్టు 10న జింబాబ్వేపై తన తొలి వన్‌డే ఆడాడు.[27] అదే నెలలో, 2022 ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ T20I జట్టులో ఎంపికయ్యాడు. [28] 2022 సెప్టెంబరు 1న శ్రీలంకపై తన తొలి T20I ఆడాడు. [29]

మూలాలు

[మార్చు]
  1. [https://www.tbsnews.net/sports/sylhet-rocket-ebadot-gets-new-nickname-allan-donald-603830 'The Sylhet Rocket' - Ebadot gets new nickname from Allan Donald on TBSnews
  2. Ebadot Hossain’s profile on Sportskeeda
  3. "Ebadot Hossain". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
  4. "'Sylhet Rocket' Ebadot impresses Donald with his white-ball start". Daily-Sun (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-03-23.
  5. "Ebadat Hossain: The future fast bowler of Bangladesh". kalerkantho. Retrieved 29 October 2020.
  6. "বিমানবাহিনী থেকে ক্রিকেটের রঙিন মঞ্চে এবাদত". Roar Media (in Bengali). 11 February 2019.
  7. "এবাদতের গ্রামের বাড়িতে বইছে আনন্দের বন্যা". Samakal (in Bengali). Archived from the original on 7 జనవరి 2022. Retrieved 5 January 2022.
  8. "From volleyball to cricket: the journey of Ebadot Hossain". ESPN CricInfo. Retrieved 5 August 2016.
  9. "Ebadot's 'long story' from volleyball to Bangladesh cricket hero". France 24 (in ఇంగ్లీష్). 5 January 2022. Retrieved 5 January 2022.
  10. "National Cricket League, Tier 2: Rajshahi Division v Sylhet Division at Rajshahi, Sep 25-28, 2016". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
  11. "Dhaka Premier Division Cricket League, Abahani Limited v Mohammedan Sporting Club at Savar (4), May 8, 2017". ESPN Cricinfo. Retrieved 8 May 2017.
  12. "41st match, Bangladesh Premier League at Dhaka, Dec 6 2017". ESPN Cricinfo. Retrieved 6 November 2017.
  13. "Bangladesh Cricket League 2017/18, Central Zone: Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 27 April 2018.
  14. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
  15. "Pacers exploit green top; South recover slowly". The Daily Star (Bangladesh). Retrieved 30 November 2018.
  16. "Mohammad Naim, Yeasin Arafat, Saif Hassan - A look into Bangladesh's future". ESPN Cricinfo. Retrieved 17 August 2019.
  17. "Bangladesh include Mustafizur in preparatory squad". ESPN Cricinfo. Retrieved 4 November 2016.
  18. "Shafiul, Ebadot replace injured Taskin in ODI, Test squads". ESPN Cricinfo. Retrieved 5 February 2019.
  19. "1st Test, Bangladesh tour of New Zealand at Hamilton, Feb 28 - Mar 4 2019". ESPN Cricinfo. Retrieved 27 February 2019.
  20. "Ebadot takes six as Bangladesh clinch historic first Test win over New Zealand". Hindustan Times. Retrieved 5 January 2022.
  21. "Ebadot Hossain headlines Bangladesh's historic Test win". CricBuzz. Retrieved 5 January 2022.
  22. "Black Caps humbled in heavy first test defeat by Bangladesh at Bay Oval". Stuff. Retrieved 5 January 2021.
  23. "Ebadot gets ODI call-up as Bangladesh name four uncapped players for Afghanistan series". ESPN Cricinfo. Retrieved 14 February 2022.
  24. "Shakib Al Hasan, Tamim Iqbal back in Bangladesh Test squad". ESPN Cricinfo. Retrieved 3 March 2022.
  25. "Anamul Haque recalled for WI white-ball series; Mustafizur Rahman back in Test squad". ESPN Cricinfo. Retrieved 22 May 2022.
  26. "Mahmudullah 'rested' for Zimbabwe T20Is as Sohan named captain". TBS News. Retrieved 22 July 2022.
  27. "3rd ODI, Harare, August 10, 2022, Bangladesh tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 10 August 2022.
  28. "Shakib Al Hasan named Bangladesh captain for Asia Cup and T20 World Cup". ESPN Cricinfo. Retrieved 13 August 2022.
  29. "5th Match, Group B (N), Dubai (DSC), September 01, 2022, Asia Cup". ESPN Cricinfo. Retrieved 1 September 2022.