ఎమ్వీ రామిరెడ్డి
నేపథ్యం
[మార్చు]గుంటూరు జిల్లా (అమరావతి) పెదపరిమి గ్రామంలో జన్మించి, అంచలంచలుగా ఎదిగి నల్లగండ్ల, హైదరాబాదులో స్థిరపడిన కవి, కథకులు, జర్నలిస్ట్, సేవాతత్పరులు ఎమ్వీ రామిరెడ్డి (MV Rami Reddy). 11 సంవత్సరాలు ఈనాడు సబ్-ఎడిటర్‌గా పనిచేశారు. 2006 నుంచి రామ్‌కీ ఫౌండేషన్ సి.ఇ.ఒ.గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సాహిత్య కృషి
[మార్చు]ఇప్పటివరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథాసంపుటులు వెలువరించారు.
ప్రచురించిన పుస్తకాలు
[మార్చు]కవిత్వం:
1. బిందువు (1997)
3. అజరామరం (2015)
4. అనిర్వచనం (2022) Archived 2023-05-11 at the Wayback Machine
కథలు:
1. వెన్నలో లావా (2011)
3. స్పర్శవేది (2021) Archived 2023-05-09 at the Wayback Machine
ఇతర ప్రక్రియలు:
- ఒక నవల (సగం కాలిన జీవితం, ‘చతుర’లో ప్రచురితం)
- నాలుగు రేడియో నాటికలు, రెండు రేడియో నాటకాలు
- ముప్ఫైకి పైగా విమర్శా వ్యాసాలు
- ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తుల జీవిత కథనాలు 30 దాకా
సంపాదకత్వం:
- పదవ తరగతి తరవాత (1999)
- రైతు కవిత (డాక్టర్ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గార్లతో కలిసి)
పురస్కారాలు
[మార్చు]- ఆకాశవాణి జాతీయ సర్వభాషా కవిసమ్మేళనం 2023 (తెలుగు భాషనుంచి)
- చెంగవల్లి వెంకట రమణయ్య స్మారక సాహితీ పురస్కారం – 2022
- మక్కెన రామసుబ్బయ్య కథాపురస్కారం – 2022 (స్పర్శవేది కథాసంపుటి)
- గిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం – 2022 (స్పర్శవేది)
- ప్రియమైన రచయితల సంఘం విశిష్ట సాహితీ పురస్కారం (10-09-2022)
- మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం – 2021 (స్పర్శవేది కథాసంపుటి)
- కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం (వెంట వచ్చునది-2020)
- అంగలకుదిటి సుందరాచారి స్మారక పురస్కారం (వెంట వచ్చునది-2020)
- శకుంతలా జైనీ కళా పురస్కారం (2020)
- తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం (2018కి గాను 2022 జనవరిలో)
- కొండసాని నారాయణరెడ్డి స్మారక జాతీయ సాహిత్య పురస్కారం (వెంట వచ్చునది–2019)
- వాసిరెడ్డి భాస్కరరావు స్మారక పురస్కారం, అరసం, వరంగల్ (వెంట వచ్చునది-2019)
- ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం, సిద్ధిపేట, తెలంగాణ (అజరామరం–2017)
- గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు (అజరామరం–2016)
- రాజీవ్ గాంధి ఎక్స్‌లెన్స్ అవార్డు, ఢిల్లీ (2013)
- చెలిమి సాంస్కృతిక సమితి పురస్కారం (మనిషి జాడ - 2012)
- కోటపాటి మురహరిరావు సాహితీ పురస్కారం (2012)
- ఎస్.వి.డి. సాహితీ పురస్కారం 2011 (మనిషి జాడ)
- ఆంధ్ర నాటక కళాసమితి కవితా పురస్కారం 2003
- రంజని - కుందుర్తి అవార్డు 2002
- రచన - కథాపీఠం పురస్కారం 2001
- కాశీభట్ల హనుమాంబ స్మారక కథా పురస్కారం 2000
సేవాపథం
[మార్చు]- తండ్రిగారి స్మృత్యర్థం స్థాపించిన ‘‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’’ తరఫున 1998 నుంచీ సేవాకార్యక్రమాలు.
- సుమారు 45 మంది పిల్లల చదువుకు ఆర్థికసాయం. వారిలో పాతిక మంది వరకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
- మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు అడపాదడపా నిర్వహణ.
- నిరుద్యోగ యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన.
- వృద్ధాలయం నిర్వహణ
- ట్రస్టు తరఫున ఇప్పటిదాకా 15 పుస్తకాల ప్రచురణ (ఇతర రచయితలవీ కలిపి).
మూలాలు
[మార్చు]01. మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్
02. Asianet News Telugu (May 8th, 2022) "మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2022 ప్రకటన"
03. Daily GK in Telugu (12th February, 2020) "కొలకలూరి పురస్కారాలు- 2020 విజేతల ప్రకటన" Archived 2023-05-11 at the Wayback Machine
04. ETV Bharath (5th September, 2022) "చిన బాపిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్దాలయం ప్రారంభం"