ఎయిర్ కెనడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎయిర్ కెనడా
IATA
AC
ICAO
ACA
Callsign
AIR CANADA
కార్యకలాపాల ప్రారంభం1 January 1965 (as Air Canada)
Hubs
 • Calgary International Airport
 • Montréal–Pierre Elliott Trudeau International Airport
 • Toronto Pearson International Airport
 • Vancouver International Airport
దృష్టి సారించిన నగరాలు
 • Edmonton International Airport
 • Halifax Stanfield International Airport
 • Ottawa Macdonald-Cartier International Airport
 • Winnipeg James Armstrong Richardson International Airport
m:en:Frequent-flyer programAeroplan
m:en:Airport loungeMaple Leaf Lounge
Subsidiaries
 • Air Canada Express
 • Air Canada Rouge
 • Air Canada Cargo
Fleet size172 (mainline)
గమ్యస్థానములు178 (incl. subsidiaries)
సంస్థ నినాదము'Your World Awaits'
ప్రధాన కార్యాలయముMontreal, Quebec, Canada
కీలక వ్యక్తులు
 • David I. Richardson (Chairman)
 • Calin Rovinescu (President & CEO)
ఆదాయముIncrease Canadian dollar
Operating incomeIncrease CAN$619 million (2013)
స్థూల ఆదాయమ్Increase CAN$10 million (2013)
మొత్తం ఆస్తులుIncrease CAN$9.470 billion (2013)
Total equityIncrease CAN$-1.460 billion (2013)
ఉద్యోగులు27,000 (2013)

ఎయిర్ కెనడా (AIR CANADA) అనేది కెనడాలో ప్రధాన వైమానిక సంస్థ, అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ. ఈ ఎయిర్ లైన్ 1936 లో ప్రారంభమైంది. ప్రయాణికులతో పాటు సరుకులు రవాణా చేసే కార్గో విమానాలను ప్రపంచ వ్యాప్తంగా 178 గమ్యస్థానాలకు నడిపిస్తోంది. విమానాల పరిమాణ పరంగా ప్రపంచంలో 9వ అతి పెద్ద ప్యాసింజర్ ఎయిర్ లైన్ ఇది. అంతేకాదు ఈ ఎయిర్ లైన్ స్టార్ అలయన్స్ లో వ్యవస్థాపక సభ్యత్వం కలిగి ఉంది.[1] ఎయిర్ కెనడా యొక్క కార్పోరేట్ ప్రధాన కార్యాలయాలు మాంట్రియల్ , క్యూబెక్ [2] లో ఉన్నాయి. దీని అతి పెద్ద స్థావరం ఒంటారియో లోని మిస్సిస్స్వాగా టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఉంది. ఎయిర్ కెనడాకు 2013లో ప్యాసింజర్ల ద్వారా CA$12.38 బిలియన్ల ఆదాయం వచ్చింది.

చరిత్ర[మార్చు]

ఎయిర్ కెనడా వైమానిక సంస్థ 1936లో ప్రారంభమైంది తన ప్రాంతీయ భాగస్వామి అయిన ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ తో కలిసి 2012లో కెనడా ఎయిర్ లైన్స్ సుమారు 35 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది.

అవార్డులు-గుర్తింపులు[మార్చు]

ఎయిర్ కెనడా సంస్థ అందించిన సేవలకు గాను అనేక సంస్థలు అవార్డులు ప్రకటించాయి.

 • 2012లో మూడోసారి వరుసగా “ఉత్తర అమెరికాలో ఉత్తమ అంతర్జాతీయ వైమానిక సంస్థ” అవార్డును మూడోసారి గెలుచుకుంది. ఈ అవార్డుకోసం జరిపిన సర్వేలో మొత్తం 18 మిలియన్ల ఎయిర్ లైన్ ప్యాసింజర్లు పాల్గొన్నారు.
 • 2012లో జరిగిన కెనడియన్ బిజినెస్ ట్రావెల్ సర్వే ప్రకారం వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే 79 శాతం పైగా మంది కెనడా ప్రయాణికులు ఎయిర్ కెనడా వైమానికి సంస్థకు ప్రాధాన్యతనిచ్చారు.

గమ్యాలు[మార్చు]

ఎయిర్ కెనడా దేశీయంగా 21 గమ్యాలకు, అంతర్జాతీయంగా 81 గమ్యాలకు విమానాలు నడుపుతోంది. వీటిలో ప్రాంతీయ భాగస్వాములతో కలుపుకుని ఈ సంస్థ 5 ఖండాల్లోని 46 దేశాల్లోగల మొత్తం 181 గమ్యస్థానాలకు విమానాలు నడుపుతోంది.

ముఖ్యమైన ఎయిర్ కెనడా మార్గాలు [3]

 • ఎయిర్ కెనడా ముంబయి - లండన్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ - లండన్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ టొరంటో విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ జ్యూరిచ్ విమానాలు
 • ఎయిర్ కెనడా ముంబయి జ్యూరిచ్ విమానాలు
 • ఎయిర్ కెనడా బెంగళూరు - ఫ్రాంక్ ఫర్ట్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ మ్యూనిచ్ విమానాలు
 • ఎయిర్ కెనడా ముంబయి ఫ్రాంక్ ఫర్ట్ విమానాలు
 • ఎయిర్ కెనడా ముంబయి మ్యూనిచ్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ ఫ్రాంక్ ఫర్ట్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ బ్రస్సెల్స్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ మిలాన్ విమానాలు
 • ఎయిర్ కెనడా చెన్నై - ఫ్రాంక్ ఫర్ట్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ ప్యారిస్ విమానాలు
 • ఎయిర్ కెనడా ముంబయి ఇస్తాంబుల్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ ఇస్తాంబుల్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ రోమ్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ హాంకాంగ్ విమానాలు
 • ఎయిర్ కెనడా కొత్త ఢిల్లీ టోక్యో విమానాలు
 • ఎయిర్ కెనడా మాంట్రియల్ టొరంటో విమానాలు

విమానాలు[మార్చు]

జూన్ 2014 నాటికి ఎయిర్ కెనడా (ఎయిర్ కెనడా రోగ్ సహా) సంస్థలో కలిపి మొత్తం 196 విమనాలున్నాయి.[4][5] ప్రధాన మార్గాల్లో నడిచే అన్ని విమానాల్లోని అన్ని తరగతుల్లో విడివిడిగా వీడియో డిస్ ప్లేలు అమర్చబడి ఉంటాయి.[6][7][8][9][10] అత్యధికగా వైడ్ బాడీ గల విమానాలను(బోయింగ్ 767, బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ A330) టోరంటో, మాంట్రియల్, వాన్ కూవర్, కాల్ గరీ నుంచి నడిపిస్తున్నారు.

సేవలు[మార్చు]

ఇన్ ఫ్లైట్ సేవలందించే అత్తుత్తమ వైమానిక సంస్థల్లో ఒకటిగా ఎయిర్ కెనడా గుర్తింపు పొందింది. సినిమా, విభిన్నమైన టీవీ షోలు విమానంలో ప్రయాణించే వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఎయిర్ లైన్ ఎంపిక చేసిన విమానాల్లో మీతో పాటు పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా సమర్ధవంతమైన బుకింగ్ సౌకర్యం, వెబ్ చెక్ ఇన్ సేవలు అందిస్తోంది. అదేవిధంగా ప్రయాణించే దూరం, మార్గం, టికెట్ ధర ఆధారంగా బ్యాగేజ్ సదుపాయాలుంటాయి.

మూలాలు[మార్చు]

 1. "Star Alliance Member Airline - Air Canada". Star Alliance. Archived from the original on 17 ఏప్రిల్ 2009. Retrieved 4 April 2009.
 2. "Investors Contacts" Air Canada. Retrieved on 18 May 2009.
 3. "Air Canada". Cleartrip. 15 May 2015. Archived from the original on 12 మే 2015. Retrieved 15 May 2015.
 4. "Air Canada". ch-aviation GmbH. Archived from the original on 2013-11-10. Retrieved 2015-05-19.
 5. "Air Canada rouge". ch-aviation GmbH. Archived from the original on 2013-11-10. Retrieved 2015-05-19.
 6. Air Canada/Air Canada Jazz fleet Date accessed: 18 February 2009
 7. Cabin Comfort - Economy Class - North America Date accessed: 4 December 2013
 8. Cabin Comfort - Economy Class - International Date accessed: 4 December 2013
 9. Cabin Comfort - Business Class - North America Date accessed: 4 December 2013
 10. Cabin Comfort - International Business Class Date accessed: 4 December 2013