ఎరిత్రోమైసిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎరిత్రోమైసిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(3R,4S,5S,6R,7R,9R,11R,12R,13S,14R)-6-{[(2S,3R,4S,6R)-4-(Dimethylamino)-3-hydroxy-6-methyloxan-2-yl]oxy}-14-ethyl-7,12,13-trihydroxy-4-{[(2R,4R,5S,6S)-5-hydroxy-4-methoxy-4,6-dimethyloxan-2-yl]oxy}-3,5,7,9,11,13-hexamethyl-1-oxacyclotetradecane-2,10-dione
Clinical data
వాణిజ్య పేర్లు ఎరిత్రోమైసిన్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ సిరలు, నోటి ద్వారా ఇస్తారు. నవజాత శిశువులో కంటిలో సంక్రమణాలను నివారించడానికి ప్రసవం తర్వాత ఈ కంటి లేపనం సిఫార్సు చేస్తారు.
MedlinePlus ఎరిత్రోమైసిన్
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం A (AU) B (US)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) -only (US)
Routes సిరల ద్వారా, నోటి ద్వారా ఇస్తారు. కంటి లేపనం మామూలుగా సిఫార్సు చేస్తారు.
Pharmacokinetic data
Bioavailability 30% - 65% మధ్య ఈస్టర్ రకంపై ఆధారపడి ఉంటుంది
Protein binding 90%
మెటాబాలిజం కాలేయం (5% కంటే తక్కువ విసర్జించబడుతుంది)
అర్థ జీవిత కాలం 1.5 గంటలు
Excretion Bile
Identifiers
ATC code ?
Chemical data
Formula C37H67NO13 
  • CC[C@@H]1[C@@]([C@@H]([C@H](C(=O)[C@@H](C[C@@]([C@@H]([C@H]([C@@H]([C@H](C(=O)O1)C)O[C@H]2C[C@@]([C@H]([C@@H](O2)C)O)(C)OC)C)O[C@H]3[C@@H]([C@H](C[C@H](O3)C)N(C)C)O)(C)O)C)C)O)(C)O
  • InChI=1S/C37H67NO13/c1-14-25-37(10,45)30(41)20(4)27(39)18(2)16-35(8,44)32(51-34-28(40)24(38(11)12)15-19(3)47-34)21(5)29(22(6)33(43)49-25)50-26-17-36(9,46-13)31(42)23(7)48-26/h18-26,28-32,34,40-42,44-45H,14-17H2,1-13H3/t18-,19-,20+,21+,22-,23+,24+,25-,26+,28-,29+,30-,31+,32-,34+,35-,36-,37-/m1/s1 checkY
    Key:ULGZDMOVFRHVEP-RWJQBGPGSA-N checkY

 checkY (what is this?)  (verify)

ఎరిత్రోమైసిన్ అనేది అనేక బ్యాక్టీరియా సంక్రమణాలు వంటి అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్ ఔషధము. ఇందులో శ్వాసకోశ అంటువ్యాధులు, చర్మానికి సంబంధించినవి, క్లామిడియా అంటువ్యాధులు, కటి శోథ వ్యాధి, సిఫిలిస్ వంటివి ఉన్నాయి[1]. ఇది గర్భధారణ సమయంలో నవజాత శిశువులో గ్రూప్ B స్ట్రెప్టోకోకల్ సంక్రమణాన్ని నివారించడానికి, అలాగే కడుపు ఖాళీ చేయడం ఆలస్యమయితే ఆ పరిస్థితి మెరుగుపరచడానికి కూడా ఉపయోగించుతారు[1][2]. దీనిని సిరల ద్వారా, ఇంకా నోటి ద్వారా ఇస్తారు[1]. నవజాత శిశువులో కంటిలో సంక్రమణాలను నివారించడానికి ప్రసవం తర్వాత ఈ కంటి లేపనం మామూలుగా సిఫార్సు చేస్తారు[3].

సాధారణ దుష్ప్రభావాలలో కడుపు తిమ్మిరి, వాంతులు, అతిసారం ఉంటాయి. మరింత తీవ్రమైన దుష్ప్రభావాలలో క్లోస్ట్రిడియం డిఫిసిల్ పెద్దప్రేగు శోథ, కాలేయ సమస్యలు, దీర్ఘకాలిక QT అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు. పెన్సిలిన్ అలెర్జీ ఉన్నవారిలో కూడా దీనిని సాధారణంగా సురక్షితంగా ఉపయోగిస్తారు[1]. ఎరిత్రోమైసిన్ గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి సురక్షితంఅని భావిస్తున్నారు[4]. సాధారణంగా తల్లిపాలను ఇచ్చే సమయంలో కూడా సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ, మొదటి రెండు వారాలలో తల్లికి దీనిని ఉపయోగించడం వలన శిశువులో పైలోరిక్ స్టెనోసిస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది[5]. ఈ వయస్సులో శిశువుకి నేరుగా ఇస్తే కూడా ఈ ప్రమాదం ఏర్పడుతుంది. ఇది యాంటీబయాటిక్స్ మాక్రోలైడ్ కుటుంబంలో ఉంది. ఇది బ్యాక్టీరియా ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది[1].

ఎరిత్రోమైసిన్ మొట్టమొదట 1952 లో సాక్కరోపోలిస్పోరా ఎరిత్రియా అనే బ్యాక్టీరియా నుండి వేరుచేసారు[1][6]. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన ఔషధాల జాబితాలో క్లారిథ్రోమైసిన్ కు ప్రత్యామ్నాయంగా ఉంది[7]. ఇది సాధారణ ఔషధంగా లభిస్తుంది. ఎక్కువ ఖరీదైనది కాదు. [5]. 2017 లో, ఇది అమెరికాలో రెండు మిలియన్లకు పైగా ప్రిస్క్రిప్షన్లతో ఈ ఔషధం 215వ అత్యంత సాధారణంగా సూచించబడింది[8][9].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Erythromycin". The American Society of Health-System Pharmacists. Archived from the original on 2015-09-06. Retrieved Aug 1, 2015.
  2. . "Clinical guideline: management of gastroparesis".
  3. . "Treatment and prevention of ophthalmia neonatorum".
  4. "Prescribing medicines in pregnancy database". Australian Government. August 23, 2015. Archived from the original on April 8, 2014.
  5. 5.0 5.1 Hamilton, Richard J. (2013). Tarascon pocket pharmacopoeia (2013 delux lab-coat ed., 14th ed.). [Sudbury, Mass.]: Jones & Bartlett Learning. p. 72. ISBN 9781449673611. Archived from the original on 2020-08-01. Retrieved 2017-09-09.
  6. Vedas, J. C. (2000). Biosynthesis : polyketides and vitamins. Berlin [u.a.]: Springer. p. 52. ISBN 9783540669692. Archived from the original on 2020-08-01. Retrieved 2017-09-09.
  7. World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  8. "The Top 300 of 2020". ClinCalc. Archived from the original on 12 February 2021. Retrieved 11 April 2020.
  9. "Erythromycin - Drug Usage Statistics". ClinCalc. Archived from the original on 30 March 2020. Retrieved 11 April 2020.