ఎర్రబాలెం(క్రోసూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఎర్రబాలెం(క్రోసూరు)" గుంటూరు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గ్రామం.

ఎర్రబాలెం
—  రెవిన్యూ గ్రామం  —
ఎర్రబాలెం is located in Andhra Pradesh
ఎర్రబాలెం
ఎర్రబాలెం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°33′22″N 80°10′55″E / 16.556013°N 80.181927°E / 16.556013; 80.181927
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం క్రోసూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ నర్రా వాసుదేవరావు ఎం.సి.యే
పిన్ కోడ్ 522410.
ఎస్.టి.డి కోడ్ 08640

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ మందాల గోవిందరావు, నాగశేషమ్మ దంపతులు సామాన్య కుటుంబానికి చెందినవారు. అక్షరఙానం లేనివారు. ఆర్థిక ఇబ్బందులవలన, వీరు జీవనోపాధికోసం, గుంటూరు నగరానికి వలస వచ్చారు. వీరి కుమారుడు నరేశ్ కు చిన్నతనం నుండి చదువంటే అమితమైన ఇష్టం. ఇతనికి చదువుకోవాలని అభిలాష ఉన్నా, అనుకూలించని వాతావరణం. అయినా ఇతడు చిన్నతనం నుండియే కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. పేపర్ బాయ్ గా పనిచేయుచూ, అమ్మా నాన్నల చిరువ్యాపారానికి చేయూతనందించుచూ, ఆర్థిక వనరులు సమకూర్చుకొని, ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుచూ విద్యాభ్యాసం కొనసాగించుచూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎం.టెక్. 70% తోనూ, ఎం.సి.య్యే. 78% మార్కులతోనూ ఉత్తీర్ణుడై, ప్రస్తుతం విఙాన్ విశ్వవిద్యాలయంలో ఐ.టి విభాగంలో సహాయ ఆచార్యులు (Assistana Professor) గా పనిచేస్తున్నారు. వీరు వ్రాసిన పలు వ్యాసాలు, అంతర్జాతీయ జర్నల్సులో ప్రచురితమైనవి. వీరు 2014 సంవత్సరంలో విఙాన్ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ఆచార్యులు (Best Professor) గా ఎన్నికైనారు. [1]