విద్యుద్ఘాతము
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విద్యుత్తు ప్రవహిస్తున్నపుడు విద్యుత్ ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్ ప్రవహించినపుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతము అంటారు. విద్యుద్ఘాతంను ఆంగ్లంలో ఎలక్ట్రిక్ షాక్ అంటారు. విద్యుద్ఘాతము యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ విద్యుత్ ఘాతంను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది. మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు, విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాలపాలవుతాడు.
వైద్యంలో విద్యుద్ఘాతము యొక్క ఉపయోగం
[మార్చు]పేరు పొందిన ఆసుపత్రుల లో కాన్సర్ వంటి కొన్ని రోగాలను తక్కువ మోతాదులో విద్యుత్ ఘాతంను ఉపయోగించి నయం చేస్తున్నారు.
తేమ వలన సంభవించే విద్యుత్ ఘాతాలు
[మార్చు]వర్షం పడుతున్నప్పుడు ఇంటిలోని నాణ్యతలేని గోడలు తడిసి ఉంటాయి. గోడలతో పాటు విద్ద్యుత్ ఉపకరణాలు కూడా తడిసి ఉంటాయి. తడిసిన ఉపకరణాలు తగలడం వలన నెమ్ము ద్వారా విద్యుత్ శరీరం లోనికి ప్రవహిస్తుంది. తడిగా ఉన్న చేతులతో విద్యుత్ మీటలు వేసేటప్పుడు కూడా విద్యుతాఘాతం తగులుతుంది.
భయం వలన మరణం
[మార్చు]విద్యుద్ఘాతం వలన కలిగిన ప్రమాదం తక్కువగా ఉన్నా కొన్ని సార్లు మరణం సంభవించడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం భయం. భయం వలన గుండె ఆగి పోయే అవకాశాలు ఉంటాయి.
నిర్లక్ష్యం వలన మరణాలు
[మార్చు]విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపి వేయమని తగిన సమాచారం సంబంధిత వారికి అందించి వారి అనుమతి లభించిన తరువాతే వీరు మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఈ సమయంలో విద్యుత్ సరఫరా కాదులే అని సంబంధిత వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మత్తులు చేసేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందించిన సమాచారాన్ని సరిగ్గా ఆలకించక విద్యుత్ సరఫరాను నియంత్రణ చేసే వ్యక్తి ఒక తీగను పునరిద్ధరించబోయి మరమత్తులు జరుగుతున్న మరొక తీగకు విద్యుత్ ను సరఫరా చేసినట్లయితే మరమత్తులు చేస్తున్న వారు ప్రమాదానికి గురవుతారు.
పిడుగు ద్వారా విద్యుత్ ఘాతం
[మార్చు]వర్షం కురుస్తున్నప్పుడు మెరుపు మెరిసి ఉరుము ఉరిమి పిడుగులు పడుతుంటాయి. పిడుగు అంటే మేఘాలు గుద్దుకున్నప్పుడు ఉత్పన్నమయిన విద్యుత్. ఈ పిడుగు పడిన చోట ఉన్నవారికి విద్యుద్ఘాతం కలిగి ప్రమాదానికి గురవుతుంటారు. ఈ పిడుగు పాటు విద్యుత్ నుండి రక్షించుకోవడానికి పెద్ద పెద్ద భవనాలపై అయస్కాంతపు మెరుపు కడ్డీలను అమర్చడం ద్వారా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ ను నేరుగా భూమిలోనికి పంపిస్తారు.
విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు ఎందుకని చనిపోవు
[మార్చు]కావాల్సినంత వోల్టేజ్ విద్యుచ్ఛక్తి శరీరం గుండా ప్రవహించినప్పుడు మాత్రమే విద్యుతాఘాతం అవుతుంది. విద్యుత్ తీగల మీద కూర్చున్న పక్షులు సాధారణంగా ఒక తీగ మీదనే కూర్చుంటాయి. అందువల్ల వాటి శరీరం గుండా విద్యుచ్ఛక్తి ప్రవహించదు. విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు తీగ మీద కూర్చొన్న పక్షి నేలను తాకినా, కూర్చున్న తీగ కాక మరొక తీగ తగిలినా, మరొక తీగపై కూర్చున్న మరొక పక్షిని తగిలినా విద్ద్యుత్ వలయం పూర్తయి దాని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించి ఆ పక్షి మరణిస్తుంది.
చెప్పులు ధరించిన వ్యక్తికి విద్యుతాఘాతం ఎందుకు కలగదు
[మార్చు]దాదాపు అన్ని రకాల చెప్పులు విద్యుత్ ప్రవాహా నిరోధకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తికి విద్యుతాఘాతం తగలాలంటే తన ద్వారా తగినంత విద్యుత్ మరొక చోటుకి ప్రవహించి విద్యుత్ వలయం పూర్తికావాలి. ఫేస్ వైర్ అనగా విద్యుత్ ప్రవహిస్తున్న తీగను నేలపై నిలిచి ఉన్న వ్యక్తి తగిలినట్లయితే సర్క్యూట్ పూర్తయి ఆ వ్యక్తికి షాక్ కొడుతుంది. విద్యుత్ ప్రవాహా నిరోధకాలైన చెప్పులు ధరించిన వ్యక్తి విద్యుత్ ప్రవహిస్తున్న వైరును తగిలినప్పటికి ఫేస్ కి ఎర్త్ కి మధ్యన విద్యుత్ ప్రవాహ నిరోధకాలు ఉన్నందున విద్యుత్ వలయం పూర్తి కాలేదు కాబట్టి ఫేస్ వైరు తగిలి ఉన్నప్పటికి ఆ వ్యక్తి అఘాతం కలగదు, కాని చెప్పులు తడిగా ఉన్నట్లయితే అఘాతం కొడుతుంది.
విద్యుద్ఘాతము ద్వారా మరణశిక్ష
[మార్చు]కొన్ని దేశాలలో మరణశిక్ష పడిన ఖైదీలకు ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా విద్యుద్ఘాతము కలిగించి మరణశిక్షను ఆమలు చేస్తున్నారు.