ఎల్ఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎల్ఫ్‌లు (ఆంగ్లం: elves) అంటే గెర్మనీయ పురాణాల్లో ఒక రకమైన అద్భుత జీవి.[ఆధారం చూపాలి] సాధారణంగా ఎల్ఫ్‌లకి మంత్రజాలానికీ, ప్రకృతికీ సంబంధించిన శక్తులు ఉంటాయి. ఎల్ఫ్‌ల రూపం చాలామటుకు మనిషిలాంటిదే, కానీ తమకి మొనదేలిన చెవులు ఉంటాయి. కొన్ని కథల్లో పొడుగ్గా ఉంటే మరికొన్ని కథల్లో పొట్టిగా ఉంటారు.

నీల్ల్ బ్లొమ్మెర్ చేసిన Ängsälvor (స్వీడిష్ లో "మైదానపు ఎల్ఫ్‌లు") (1850)

వ్యుత్పత్తి

[మార్చు]

మూల-గెర్మనీయ భాషలో *albiz అనే పదం ఆంగ్లంలో "elf"లా, పూర్వ నోర్సు భాషలో "álfr"లా మారింది. ఈ *albiz పదానికి మూల-సింధ-ఐరోపా భాషలో *albʰós అనే పదంలో మూలాలు ఉన్నాయి. ఈ పదం సంస్కృతంలో "ఋభు"లా మారింది.[ఆధారం చూపాలి] *albʰósకి "తెలుపు" అన్న అర్థం.

చరిత్ర

[మార్చు]

ఉత్తర ఐరోపా పురాణాల్లో ఎల్ఫ్‌లను తరుచుగా ప్రస్తావిస్తారు. స్నొర్రి స్టుర్లుసొన్ రాసిన "గద్యపు ఎడ్డ"లో, రెండు రకాల ఎల్ఫ్‌లు ఉంటారని రాసి ఉంది: స్వర్గంలో నివసించే తెల్ల ఎల్ఫ్‌లు, భూమి కింద నివసించే నల్ల ఎల్ఫ్‌లు.

ఆధునిక సాహిత్యం

[మార్చు]

జే. ఆర్. ఆర్. టోల్కీన్ రచనల్లో కొన్ని పాత్రలు ఎల్ఫ్‌లు. టోల్కీన్ కథల్లో ఎల్ఫ్‌లు చాలా ఎత్తుగా, అందంగా ఉంటారు. వాళ్లు విల్లు-బాణం వాడడంలో సామర్థ్యులు, వాళ్లకి మాంత్రిక శక్తులు కలిగి ఉంటాయి. వాళ్లు చిరంజీవులు. టొల్కీన్ కథలు జరిగే మధ్య-భూమి అనే లోకంలో, రెండు ఋభు భాషలు ఉంటాయి. వాటి పేర్లు సిండరిన్, క్వెన్య.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్ఫ్&oldid=4322969" నుండి వెలికితీశారు