Jump to content

ఎల్‌కేజీ 2020

వికీపీడియా నుండి
ఎల్‌కేజీ 2020
దర్శకత్వంకె.ఆర్‌.ప్రభు
రచనఆర్జే బాలాజీ
నిర్మాతఇషారి కె.గణేశ్‌
తారాగణంఆర్జే బాలాజీ
ప్రియ ఆనంద్
ఛాయాగ్రహణంవిధు అయ్యన్న
కూర్పుఆంథోని
సంగీతంలియోన్‌ జేమ్స్‌
పంపిణీదార్లుఆహా
విడుదల తేదీ
25 జూన్ 2021
సినిమా నిడివి
124 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎల్‌కేజీ 2020 తమిళంలో ఎల్‌కేజీ పేరుతో 2019లో విడుదలై.. 2021లో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. ఆర్జే బాలాజీ, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు.

తన తండ్రి ఓ పొలిటకల్ పార్టీలో ఉపన్యాసుకుడుగా మిగిలిపోతాడు. దాంతో లంకవరపు కుమార్‌ గాంధీ అలియాస్‌ ఎల్‌కేజీ(ఆర్జే బాలాజీ) తాను రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలని నిర్ణయించుకుంటాడు. దాంతో తన ఊళ్లో వార్డు కౌన్సిలర్ గా పొలిటికల్ కెరీర్ మొదలెడతాడు. ప్రతీది ఓటుగానే భావించే ఆ వార్డులో వాళ్లకు తలలో నాలుకలా మారిపోతాడు. వాళ్ల పనులు క్షణాల్లో చేయించి మెప్పు పొందుతాడు. ఈ లోగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యం బారిన పడి మరణిస్తాడు. దీంతో ఎల్‌కేజీ ఖాళీ అయిన ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అందుకోసం ఎలక్షన్ వ్యవహారాలు చూసే ఓ కార్పోరేట్ కంపెనీ ని కన్సల్ట్ చేస్తాడు. ఆ కంపెనీ ఇంఛార్జ్ (ప్రియా ఆనంద్) సలహాలు తీసుకుంటాడు. అందుకోసం ఎల్‌కేజీ వేసే ఎత్తులేమిటి?? చివరకు ఎల్‌కేజీ ఎమ్మెల్యే అయ్యాడా? అనేదే మిగతా సినిమా కధ.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • రచన: ఆర్జే బాలాజీ
  • దర్శకత్వం: కె.ఆర్‌.ప్రభు
  • నిర్మాత: ఇషారి కె.గణేశ్‌
  • సంగీతం: లియోన్‌ జేమ్స్‌
  • సినిమాటోగ్రఫ్రీ: విధు అయ్యన్న
  • ఎడిటింగ్‌: ఆంథోని

మూలాలు

[మార్చు]
  1. EENADU (27 June 2021). "LKG 2020 Review: ఎల్‌కేజీ 2020 రివ్యూ - rj balaji lkg 2020 telugu movie review". www.eenadu.net. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.