ఎల్. వైద్యనాథన్
Jump to navigation
Jump to search
ఎల్. వైద్యనాథన్ | |
---|---|
దస్త్రం:L.VaidyanathanImg.jpg | |
జననం | లక్ష్మీనారాయణ వైద్యనాథన్ 1942 ఏప్రిల్ 9 |
మరణం | 2007 మే 19 చెన్నై | (వయసు 65)
వృత్తి | వయొలిన్ వాయిద్యకారుడు, సంగీత దర్శకుడు |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | వి. లక్ష్మీనారాయణ |
సంగీత ప్రస్థానం |
లక్ష్మీనారాయణ వైద్యనాథన్ (1942 ఏప్రిల్ 9 – 2007 మే 19) సంగీత దర్శకుడు, గాయకుడు.[1] కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడు. తమిళ కన్నడ భాషల్లో సుమారు 170 సినిమాలకుపైగా పని చేశాడు. ఈయన ఆర్. కె. నారాయణ్ రచించిన మాల్గుడి కథల ఆధారంగా దూరదర్శన్ లో ప్రసారమైన మాల్గుడి డేస్ ధారావాహికకు సంగీతం అందించాడు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]వైద్యనాథన్ చెన్నైలో లక్ష్మీనారాయణ, సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. వీరిద్దరూ పేరొందిన సంగీతజ్ఞులు. వయొలిన్ వాయిద్యంలో పేరు గాంచిన సంగీత ద్వయం ఎల్. శంకర్, ఎల్. సుబ్రమణియం ఈయన తమ్ముళ్ళు. వీరు ముగ్గురూ తండ్రి నుంచి సంగీతంలో శిక్షణ పొందారు.[3]
కెరీర్
[మార్చు]ఈయన మొదట్లో జి. కె. వెంకటేష్ దగ్గర సహాయకుడుగా పని చేశాడు. తమిళ కన్నడ భాషల్లో సుమారు 170 సినిమాలకు పైగా పని చేశాడు.
2003 లో తమిళనాడు ప్రభుత్వం ఈయనకు కళైమామణి పురస్కారం ప్రధానం చేసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Juries for the selection of films for National Awards set up". Press Information Bureau, Govt of India. Retrieved 2009-07-28.
- ↑ "Music director L. Vaidyanathan dead". The Hindu. 20 May 2007. Archived from the original on 21 May 2007. Retrieved 2009-07-28.
- ↑ "We need sweet memories…". The Hindu. 25 May 2007. Archived from the original on 23 September 2007. Retrieved 2009-07-28.
- ↑ "Kalaimamani awards announced". Frontline. 11 October 2003.